భారత దేశం లో వంటలు చాలా రుచి గా ఉంటాయి దీనికి కారణం వంటల లో వాడే మసాలా దినుసులు, ఇవి రుచి ని మాత్రమే ఇవ్వడం కాకుండా మంచి సువాసన ని వెద జల్లుతుంది. అతి పురాతన కాలం నుంచి ఇవి వినియోగిస్తున్నప్పటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఈ మసాలా దినుసుల లో అతి ముఖ్య మైనది Yalakulu, ఇది ఎక్కువ గా బిర్యానీ, స్వీట్స్ లో మంచి వాసన , రుచి కి ఉపాయోగిస్తారు.
ఈ యాలకులు దక్షిణ భారత దేశం లోని పశ్చిమ కొండల లో పుట్టింది. ఇప్పుడు దీని ఉత్పత్తి గ్వాటెమాల, చైనా , టాంజానియా, ఇండో చైనా ప్రాంతం దేశాలు, మరియు శ్రీలంక వంటి దేశాల కి వ్యాపించింది.రోమన్లు మరియు గ్రీకులు దీన్ని సుగంధ ద్రవ్యం గా , ఈజిప్షియన్లు ఏమో పండ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించారు.
యాలకులు జీర్ణాంతర వ్యాధుల నివారణ కి, నోటి ఇన్ఫెక్షన్లు, ఛాతి యొక్క రద్దీ, గొంతు సమస్యలు వంటి వాటికి నివారణ గా పని చేస్తుంది అని నమ్ముతారు. అంతే కాకుండా యాలకులు ని విషానికి విరుడు గా కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుత రోజుల్లో యాలకులు ప్రపంచం లోనే అత్యంత ధర పలుకుతున్న మసాలా దినుసులు లో ఇది ఒకటి, కేవలం రుచి కి మాత్రమే కాకుండా స్పైసీ వంటకాల నుండి షర్బత్ ల వరకు అనేక రకాల వంటల లో, ఔషధాల లో వినియోగిస్తున్నారు.
Table of Contents
ఏలకుల్లో ప్రధానం గా రెండు రకాలు ఉన్నాయి , లేత పచ్చ రంగు యాలకులు, నల్ల యాలకులు, భారత దేశం, ఇండోనేసియా లో అధికం గా పచ్చ యాలకులు పండిస్తున్నారు. యాలకులు ని సుగంధ ద్రవ్యాల లో మూడోది గా చెప్పబడుతుంది, ఇది జింగీబెరాసెయ్ జాతి మొక్కల నుంచి లభిస్తుంది.
ఏలకులు జీర్ణ వ్యవస్థ ని మెరుగు పరచడం మాత్రమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల్ని కూడా అడ్డుకోగలుగుతుంది, యాలకుల టీ తాగితే స్ట్రెస్, డిప్రెషన్ నుండి బయట పడవచ్చు.
Yalakulu Health Benefits in telugu
- ఆయుర్వేద శాస్త్రం ప్రకారం యాలకుల కు కడుపు లో పుండ్లు, గ్యాస్ట్రిక్ అల్సర్స్, వ్యాధి రక్షణ కి, అజీర్ణ వ్యాధుల చికిత్స కి సహాయ పడే ముఖ్య మైన ఔషధ గుణాలు ఉన్నాయి అని జంతు నమూనాల పై జరిగిన పరిశోధన లో తేలింది.
- యాలకులు సంతాన సాఫల్యత ని పెంచడం లో, ఇందులో ఉండే సినియోల్ అనే కాంపౌండ్ పురుషుల్లో నరాల పటిష్టత కి చాలా బాగా సహాయ పడుతుంది. లైంగిక సామర్ధ్యం తక్కువ ఉన్న వారు, నరాల బలహీనత ఉన్న వారు ఏలకులు ఉపయోగించాలని డాక్టర్లు చెప్తున్నారు.
- అనేక రకాల వ్యాధుల ను నయం చేయడానికి సుగంధ ద్రవ్యాల ను అరోమాథెరపీ లో వాడటం జరుగుతుంది. అరోమాథెరపి లో అనేక రకాల పద్ధతులు ఉన్నప్పటి కి అత్యంత సాధారణ పద్ధతి అయిన పరిమళ వ్యాపకం లో యాలకుల చమురు వంటి పరిమళ ఆయిల్స్ వాడటం జరుగుతుంది. అంతే కాకుండా అరోమాథెరపీ లో ఈ సుగంధ నూనె ని వాడటం వలన ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయి.
- శ్వాస నాళాల వాపు, ఉబ్బసం లాంటి వివిధ శ్వాసకోశ వ్యాధుల చికిత్స కి క్రీ.పూ 4 వ శతాబ్దం నుండి యాలకుల ని ఆయుర్వేదం లో వినియోగిస్తున్నారు.
- జలుబు , దగ్గు , కఫం , ఊపిరి ఆడక పోవడం, రొమ్ము దగ్గర ఎదో పట్టేసి నాట్లు ఉండటం లాంటి సమస్యల తో బాధ పడేవారు ఏలకులు రెగ్యులర్ గా వినియోగిస్తే ఉపశమనం కలుగు తుంది. ఇవి రక్త ప్రసరణ ని పలచ గా చేసి ఊపిరితిత్తుల కు ఊపిరి ఆడేలా చేస్తుంది, ఆస్తమా లాంటి వ్యాధుల ని కూడా నయం చేయడం లో ఇవి ఉపయోగించ వచ్చు.
- పంటి చిగుళ్ల రక్త స్రావం, పంటి నొప్పి వంటి మొదలైన రోగాల్ని నిరోధించ డానికి యాలకుల ని ఆయుర్వేదం లో ఉపయోగిస్తున్నారు. ఒక పరిశోధన ప్రకారం యాలకుల నుండి వచ్చే సువాసన, మండే స్వభావం కలిగిన సారాన్ని పంటి చికిత్స, దంత క్షయాల వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు .
- యాలకుల లో ఉండే యాంటీ మైక్రోబియాల్ లక్షణాలు అంటు వ్యాధుల్ని నయం చేయడానికి సహాయ పడుతుంది అని పరిశోధన లలో తేలింది.
- శరీరం లో హానికర విదేశీ కణాలు ఏర్పడినపుడు మంట, వాపు లాంటివి రావడం జరుగుతుంది, అలాంటప్పుడు యలకుల్లో ఉండే యూకలిప్టోల్ మంట ను తగ్గనుంచడానికి సహాయం చేస్తుంది.
- అధిక ఉప్పు శరీరం లో ఉన్నపుడు రక్త పోటు పెరిగే అవకాశం ఉంది, అధిక రక్త పోటు ని నియంత్రించడం లో ఏలకులు సహాయ పడతాయి.
- ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నపుడు యాలకుల ప్లెయిన్ టీ ని తీసుకోవడం వలన ఆందోళన లక్షణాల ను నివారించడం లో ఉపయోగించబడింది అని పరిశోధన లలో తేలింది.
- జంతు నమూనా తో జరిపిన రీసెర్చ్ లో యాలకుల రసం కాలేయ వ్యాధుల ని నివారించడం లో సహాయ పడుతుంది అని తెలిపింది.
- యాలకుల లోని వై – సబోలిన్ క్యాన్సర్ వ్యతిరేక ఏజంట్ గా పని చేస్తుంది అని క్యాన్సర్ మందుల లో కూడా వినియోగిస్తున్నారు అని తెలిసింది.
- ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె కు మంచి చేయడమే కాకుండా కొలెస్ట్రాల్ లెవల్ ని కూడా తగ్గిస్తుంది.
ఏలకులు వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి?
యాలకుల ని అధికం గా వాడటం వలన కొన్ని సార్లు అలెర్జీ వచ్చే అవకాశం ఉంది కానీ ఇది అందరికి కాదు, అంతక ముందే ఎలర్జీ సమస్యలు ఉన్న వారు తక్కువ తీసుకుంటే మంచిది .
ముగింపు
యాలకులు సాధారణం గా బ్రెడ్ తయారీ, వంటలు, స్వీట్స్ వంటి వాటిలో ఎక్కువ గా ఉపయోగిస్తారు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, కాల్షియం, విటమిన్లు వంటి అనేక రకాల ఖనిజాల్ని సమృద్ధి గా కలిగి ఉంటుంది.
Read More:-