Top 5+ Best Weight loss tips in telugu

ఈరోజుల్లో వంద మంది లో ఎనభై మందికి పైగా బరువు పెరుగుతూ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఈ సమస్య తో బాధ పడుతున్నారు. కనుక Weight loss అనేది ప్రజలు నిశ్చయించుకునే అత్యంత సాధారణ లక్ష్యాల లో ఇది ఒకటి. అయితే బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన పని, ఈ ప్రక్రియల ప్రజలు తెలీకుండా ఏది బడితే అది వాడి రోగాలు కోరి తెచ్చుకుంటున్నారు. ఈ బ్లాగ్ లో నేను సురక్షితం గా బరువు తగ్గడం ఎలా అనేది వివరిస్తున్నాను.

weight loss

బరువు పెరగడానికి కారణాలు

  • బరువు తగ్గడాని కంటే ముందు గ మనం బరువు పెరగడానికి కారణాలు తెలుసు కోవడం అనేది చాలా అవసరం.
  • మన శరీరానికి అవసరం అయ్యే క్యాలరీ లు కంటే కూడా ఎక్కువ తీసుకోవడం వలన బరువు పెరగడం జరుగుతుంది. ముఖ్యం గా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు , చక్కర, బ్యాడ్ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వలన బరువు పెరుగుతారు.
  • శారీరక శ్రమ లేకపోతే రోజంతా తక్కువ క్యాలరీ లు బర్న్ అవ్వడం వలన బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.
  • నిద్ర సరిగా పోకపోతే ఆకలి ని నియంత్రించే హార్మోన్లకు అంతరాయం కలిగి ఆకలి ఎక్కువ అవడం వలన అనారోగ్యకరమైన ఫుడ్ క్రేవింగ్స్ పెంచుతుంది.
  • థైరాయిడ్, కార్టిసాల్, ఇన్సులిన్ వంటి హార్మోన్స్ బరువు నియంత్రణ లో కీలక పాత్ర పోషిస్తాయి, కనుక ఈ ఇంబ్యాలన్సుడ్ హార్మోన్స్ వలన ముఖ్యం గ పొత్తి కడుపు ప్రాంతం లో ఫ్యాట్స్ నిల్వల ను పెంచుతాయి.
  • ఇంకా స్ట్రెస్ వలన కార్టినల్ స్థాయిలను పెంచడం వలన కొవ్వులు పెరిగే అవకాశం ఉంది.

Best Weight loss tips in telugu

  • బరువు తగ్గించే జర్నీ స్టార్ట్ చేసే ముందు కొన్ని లక్ష్యాలను నిశ్చయించు కోవడం ముఖ్యం. చాలా మంది వ్యక్తులు ఫాస్ట్ గా బరువు తగ్గడాన్ని లక్ష్యం గా చేసుకుంటారు, దీని వలన పోషకార లోపాలు ఏర్పడి సాధారణ లైఫ్ స్టైల్ ప్రారంభించిన తరువాత బరువు పెరగ డానికి దారి తీస్తుంది. అలా కాకుండా వారానికి 1 నుండి 2 పౌండ్లు కోల్పోవడం లక్ష్యం గా పెట్టుకోవాలి.
  • గుర్తుంచుకోండి , ఒక నెల లో 60 పౌండ్లు కోల్పోవడం కంటే మూడు నెలల్లో పది పౌండ్లు తగ్గడం మంచిది.
  • రోజు కి 300 నుండి 500 క్యాలరీల తక్కువ క్యాలరీ లోటు ని లక్ష్యం గా పెట్టుకోవడం వలన వారానికి ఒక పౌండ్ కొవ్వు తగ్గడానికి దారి తీస్తుంది.
  • మీ ఎత్తు, వయస్సు, బరువు, జెండర్ ఆధారం గా మీ BMR ని అంచనా వేయడానికి యాప్స్ మరియు ఆన్లైన్ కాలిక్యులేటర్ లను ఉపయోగించ వచ్చు.
  • పోషకాలు అధికం గా ఉండే ఆహారాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లాంటి పోషకాల తో నిండి ఉండుట వలన అతిగా తినాలనే క్రేవింగ్స్ తగ్గిస్తాయి.
  • పండ్లు , కూరగాయల లో విటమిన్లు, ఫైబర్, క్యాలరీలు తక్కువ గా ఉండటం వలన సంతృప్తి ని ప్రోత్సహిస్తుంది.
  • టర్కీ, చికెన్, చేపలు, టోఫు, గుడ్లు లాంటి వాటిలో లీన్ ప్రోటీన్ అధికం గా ఉండటం వలన కండర ద్రవ్యరాశి ని సంరక్షించడం లో సహాయ పడుతుంది.
  • Quinoa , Oats , Brown Rice మరియు గోధుమ బ్రేడ్ లాంటి తృణ ధాన్యాలు లో ఫైబర్ అధికం గా ఉండటం వలన శక్తి ని అందిస్తాయి.
  • ఆలివ్ నూనె, అవకాడోలు, విత్తనాలు లాంటి ఆరోగ్య కరమైన ఫ్యాట్ లను ఆహరం లో చేర్చు కోవడం వలన హార్మోన్ల సమతుల్య కు దోహదం చేస్తుంది.
  • శుద్ధి చేసిన కార్బో హైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాల లో కేలరీ లు అధికం గా ఉంటాయి మరియు ఇందులో పోషకాలు తక్కువ గా ఉంటాయి. కనుక ఇవి తినడం వలన బరువు పెరుగుతారు కనుక ఇవి తినడం మాని వేస్తే మంచిది.
  • బరువు తగ్గడానికి మంచి నీరు ఎక్కువ గా తాగడం అనేది చాలా అవసరం, ఇవి జీవక్రియ ని నియంత్రించడం లో ఉపయోగ పడుతుంది. కాబట్టి భోజనానికి ముందు ఒక గ్లాసు, రోజు కి ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు త్రాగాలను ఒక లక్ష్యం గా పెట్టుకోవాలి.
  • వ్యాయామం చేయడం వలన ఇది బరువు తగ్గుట లో ముఖ్య పాత్ర వహిస్తుంది, ఇది కొవ్వు తగ్గడానికి, ఆరోగ్యాన్ని మెరుగు పరచ డానికి సహాయ పడుతుంది.
  • కార్డియోవాస్కులర్ వ్యాయామాలు, వాకింగ్, రన్నింగ్ , సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ లాంటి కార్య క్రమాలు వారానికి కనీసం 3 గంటలు చేయుట వలన కేలరీ లను బర్న్ చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుట లో సహాయ పడుతుంది.
  • బరువు తగ్గడానికి నిద్ర కూడా అంతే పాత్ర వహిస్తుంది కనుక రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవడం అనేది చాలా అవసరం.
  • దీర్ఘకాలిక ఒత్తిడి అనేది కార్టిసాల్ విడుదల ని ప్రేరేపించడం వలన కొవ్వు నిల్వ ని ప్రోత్సహిస్తుంది. కనుక మీ దిన చర్య లో నిత్యం ధ్యానం, యోగ, డీప్ బ్రీత్ లాంటి కార్య క్రమాలను చేయడం వలన మానసిక స్థితి ని మెరుగు పరుస్తుంది.

బరువు తగ్గడం లో మైండ్ సెట్ పాత్ర

  • బరువు తగ్గడం లో మీ ఆలోచనా విధానం, పట్టుదల అనేది ఒక శక్తి వంతమైన సాధనం. ఈ ప్రక్రియ లో ఎవరు ఏమి విమర్శించినా , ఏమి అన్నా కూడా పట్టించు కోకుండా మీ గురించి మీరు ఆలోచించు కొని ప్రశాంతంగా ఉండండి.

ముగింపు

బరువు తగ్గుట అనేది సమతుల్య ఆహరం, నిత్య వ్యాయామం, స్ట్రెస్ నిర్వహణ, తగినంత నిద్ర అనే వాటి పై కీలక పాత్ర వహిస్తుంది. ఈ బ్లాగ్ లో తగినన్ని ఆహార చిట్కాలు ఫాలో అవ్వడం వలన మీరు సురక్షితం గా బరువు తగ్గడాన్ని సాధించ వచ్చు.

Read More:-

Brazil Nuts Health Benefits

Lakshman Phal Juice Health Benefits in Telugu

Leave a Comment