Vitamin B12 అనేది వాటర్ లో కరిగే విటమిన్, దీనినే కొబలమిన్ అని కూడా పిలుస్తారు, ఇది శరీరం లో వివిధ కార్య క్రమాలకు చాల అవసర మైనది. ఎర్ర రక్త కనాల ఉత్పత్తి ని ప్రోత్సహించ డానికి, డిఎన్ఏ సంశ్లేషణ కి, నరాల యొక్క కణాల ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలక పాత్ర వహిస్తుంది. కొన్ని ఇతర విటమిన్లు వలె విటమిన్ B12 ని మన శరీరం సంశ్లేషణ చేయలేదు కాబట్టి ఈ పోషకాన్ని పొందడానికి ఆహార పదార్ధాలు ముఖ్య పాత్ర పోషిస్థాయి. పెద్దలకు రోజు వారీ 2.4 మైక్రో గ్రాములు, గర్భినీ మరియు పాలు ఇచ్చే మహిళలకి ఇది కొంచెం ఎక్కువగా రికమెండ్ చేయబడింది.
విటమిన్ బి12 లోపం అనేది చాలా మంది లో కనిపించే అసాధారణ విషయం , ముఖ్యం గా శాకాహారులు మరియు వృద్ధుల లో ఈ లోపం ఎక్కువ గా కనిపిస్తుంది, ఎందు వలన అంటే బి12 జంతు ఆహరం లో ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త గా ఉండాలి అంటే విటమిన్ బి12 సమృద్ధి గా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాల అవసరం.
Table of Contents
Vitamin B12 Rich Foods In Non Veg in Telugu
ఈ ఆర్టికల్ లో నేను విటమిన్ బి12 అధికం గా ఉండే ఆహార పదార్ధాలు, అవి పోషకమైన ఆహరం లో ఎలా చేర్చుకోవాలో చర్చిస్తున్నాను.
- లివర్, కిడ్నీ లాంటి జంతు అవయవ మాంసాల లో విటమిన్ బి12 అనేది అత్యంత పుష్కలం గా దొరికే వనరు లలో ఇది ఒకటి. మేక, పొటేలు, గొర్రెలు, గొడ్డు మాంసం కాలేయం లో ఈ విటమిన్ దండి గా ఉంటుంది. నాన్ వెజ్ అనేది ప్రతి ఒక్కరి జీవిత ఆహరం లో ఒక సాధారణ భాగం కాకపోవచ్చు, కానీ ఇవి పోషక ఘనులు. వీటి లో విటమిన్ బి 12 మాత్రమే కాకుండా అధిక స్థాయి లో ఐరన్, విటమిన్ ఎ మరియు కాపర్ లభిస్తాయి.
- 100 గ్రాముల లాంబ్ లివర్లో విటమిన్ బి12 రోజువారీ విలువ DV లో 3,571% లభిస్తుంది, ఈ మాంసం లివర్ కూడా అధిక మొత్తం లో బి12 ను అందిస్తుంది, 100 గ్రాముల DV లో 990% సరఫరా చేస్తుంది. లాంబ్ కిడ్నీస్ లో కూడా 100 గ్రాముల లో విటమిన్ బి12 సుమారు 1350% DV లో అందిస్తుంది. జంతు మాంసాలు B12 కి మాత్రమే ప్రయోజన కరంగా ఉండటమే కాకుండా రోగ నిరోధక పని తీరు, జీవ క్రియ, మెదడు ఆరోగ్యం లాంటి వాటికీ తోడ్పడే ముఖ్య మైన పోషకాలు తో నిండి ఉంది.
- క్లామ్స్ అనే చిన్న షెల్ ఫిష్ రుచి కరమైనవి మాత్రమే కాకుండా విటమిన్ బి12 చాల నిండు గా లభిస్తుంది, ఇందులో కూడా బి12 100 గ్రాముల రోజువారీ సిఫార్సు చేసినచేసిన 3300% అందిస్తుంది. ఇందులో బి12 మాత్రమే కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, కూడా ఉండుట వలన గుండె ఆరోగ్యానికి ప్రయోజన కరంగా ఉంటుంది. ఇంకా సెలీనియం, అయోడిన్ తో సహా ఇతర ముఖ్యమయిన పోషకాలను అందించడం లో, థైరాయిడ్ మరియు జీవ క్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
- సార్డిన్ చేపలు లో విటమిన్ బి12అద్భుతమైన వనరు తో సహా అనేక ప్రయోజనాల ను అందించే పోషకాలు సమృద్ధి గా ఉన్నాయి, 100 గ్రాముల సార్డీన్ లో రోజువారీ సిఫార్సు చేసిన బి12 తీసుకోవడం లో 200% పైగా అందిస్తుంది. దీని తో పాటు కాల్షియం, విటమిన్ డ్, ఒమేగా 3 ఫ్యాట్స్ సమృద్ధి గా ఉన్నాయి.
- ట్యూనా చేప లో కూడా బి12 గణనీయమైన మొత్తం లో లభిస్తుంది. ఇందులో ఇంకా విటమిన్ బి3, సెలీనియం వంటి ఇతర పోషకాలతో కలిగి ఉంది.
- 100 గ్రాముల మాకెరల్ చేప లో DV లో 700% అందిస్తుంది, ఇవే కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కూడా ఇస్తుంది.
- గుడ్ల లో కూడా విటమిన్ బి 12 లభిస్తుంది, రోజువారీ ఆహరం లో 46% సరఫరా చేస్తుంది.
- చికెన్ మరియు టర్కీ కోళ్ల లో కూడా రోజు వారి సరఫరా లో 28% అందిస్తుంది.
Vitamin B12 Rich Foods In Veg Foods in Telugu
- తృణ ధాన్యాల లో కూడా విటమిన్ బి12 అధికం గానే లభిస్తుంది, బాదాం సొయా వంటి వాటిలో ఎక్కువ గా ఉంటుంది. కాకపోతే ఈ ధాన్యాలు ఉపయోగించే టప్పుడు చక్కెరలు, శుద్ధి చేసిన కార్బో హైడ్రేట్లు తక్కువ గా ఉండేవి తీసుకోవాలి
- బలమైన మొక్కల ఆధారిత పాలలో అంటే ఒక కప్పు బాదం పాలు , ఓట్స్ పాలు , బియ్యం పాలు వంటి వాటిలో రోజువారీ సరఫరా లో 50% వరకు అందిస్తుంది.
- పాలు, పెరుగు, జున్ను, చీజ్ వంటి పాల ఆధారిత పదార్ధాల లో 50% వరకు రోజువారీ సరఫరా లో అందిస్తుంది.
విటమిన్ బి 12 లోపం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు
- విటమిన్ బి 12 లోపం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సక్రమం గా జరగక పోవడం వలన రక్తం లో ఆక్సిజన్ రవాణా ని బలహీన పరుస్తుంది.
- ఇది నరాల కణాల ఆరోగ్యాన్ని కాపాడటం లో కూడా సహాయ పడుతుంది, ఇది లోపిస్తే తిమ్మిరి, మతిమరుపు, దృష్టి సహకరించక పోవడం వంటివి జరుగుతుంది.
ముగింపు
Vitamin B12 ఆరోగ్యాన్ని కాపాడటం లో ఒక ముఖ్య మైన ఆహార పోషకం, ఈ బ్లాగు లో విటమిన్ బి 12 అధికం గా ఉండే ఆహారాలు, అది లోపిస్తే వచ్చే సమస్యల గురించి వివరించడం జరిగింది.
Read More:-