ఎన్నో సంవత్సరాలు నుండి సాగు చేసున్న Pear Fruit 🍐 ఈ మధ్య కాలం లో ఎక్కువ పాపులారిటీ తో అన్ని ప్రాంతాల లో దొరుకుతుంది. ఈ పండు రోసేసి కుటుంబానికి చెందినది, ఇదే కాదు క్విన్స్, ఆపిల్స్ కూడా ఈ జాతికి చెందినవే. నిజానికి మొదట్లో కేవలం యూరప్ ఆసియాల్లో మాత్రమే పండించేవారు కానీ ఇప్పుడు ఇది అన్ని వాతావరణంలో పండుతుంది.
వీటిని మనం అనేక విధాలుగా ఫ్రెష్ గా గాని లేదా ఎండబెట్టి గాని తీసుకోవచ్చు, ఇంకా అనేక రూపాల్లో బార్ట్‌లెట్, అంజౌ మరియు బోస్క్ వంటి అనేక రకాలను అందిస్తుంది.
పియర్ ఫ్రూటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషకాహారాలు అందించడం వలన ఇది అందర్నీ ఆకట్టుకునేలా చేస్తుంది.
Table of Contents
Nutrients of Pear Fruit in Telugu
- కార్బోహైడ్రేట్లు
- డైటరీ ఫైబర్
- ప్రోటీన్
- విటమిన్ సి
- విటమిన్ కె
- పొటాషియం
- కాపర్
- ఫోలేట్
Pear Fruit Health Benefits in Telugu
- పియర్ ఫ్రూట్స్ లో ఫైబర్ అనేది తక్కువగా ఉండటం వలన ఇది జీర్ణ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది అంతే కాకుండా ప్రేగు కదలికలను ప్రోత్సహించి మలాన్ని మృదువుగా చేసి మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కరగని ఫైబర్ డైవర్టికులిటిస్ మరియు హెమరాయిడ్స్ వంటి జీర్ణ సమస్యల నుండి పోరాడటానికి సహాయ పడుతుంది.
- పియర్స్ పండు లోని పీచు పదార్థం ప్రీ బయోటికగా పనిచేయడం వలన ఆరోగ్యకరమైన గట్ కు ప్రోత్సహిస్తుంది మరియు హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపించి జీర్ణ క్రియ మెరుగుదలను తోడ్పడుతుంది.
- ఈ పియర్ ఫ్రూట్ లో పెక్టిన్ అనే పదార్థం ఉండుట వలన జీర్ణ క్రియను నెమ్మదించి సంతృప్తతను ప్రోత్సహించి బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
- పియర్ ఫ్రూట్ లో వాటర్ మరియు ఫైబర్ అధికంగా ఉండటం వలన క్యాలరీలు తక్కువ ఉంటాయి దాని వలన బరువు పెరగకుండా ఉండటానికి సహాయ పడుతుంది. ఈ పియర్ ఫ్రూట్ తినడం వలన మీకు చాలా సేపు ఆకలిగా ఉండదు. ఆకలిని నియంత్రించడానికి ఇది బాగా సహాయపడుతుంది.
- 2015లో న్యూట్రిషన్ మరియు ఫుడ్ సైన్సెస్ జర్నల్లో ఒక అధ్యయనం ప్రకారం బరువుగా ఉన్న మహిళలు రోజుకి మూడు పీర్ ఫ్రూట్స్ తిన్నారు. బరువు లేని మహిళలు ఆ ఫ్రూట్ ని తినలేదు కానీ బరువు ఎక్కువ ఉన్న మహిళలు ఈ పండు తినడం వలన తినని మహిళల కంటే బరువు తగ్గారు అని ఇందులో ప్రచురింపబడింది.
- పియర్ పండు లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన త్వరగా ఆకలి కాకుండా చేయటం తో పాటు తక్కువ కేలరీ లను నింపుతుంది కనుక ఎక్కువ కేలారీ లు ఉండే చిప్స్ తీసుకోకుండా ఇలాంటివి తీసుకోవడం ఉత్తమం.
- ఈ పియర్ పండు లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉండుట వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం లో కీలక పాత్ర వహిస్తుంది.
- అంతే కాకుండా ఈ Pear Fruit లో పోటాషియం కూడా ఎక్కువ గా ఉంది కాబట్టి హృదయ నాళాల గోడలను ఒత్తిడిని తగ్గించి అధిక రక్తపోటు నీ తగ్గిస్తుంది.
- పియర్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి రక్తనాళాల లైనింగ్లను దెబ్బతీయకుండా అతిరోస్కెలరోసిస్ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో పియర్ ఫ్రూట్ ను అధికంగా తీసుకోవడం వలన స్ట్రోక్ మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని ప్రచురించారు.
- ఈ పియర్ పండులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంచేలా చేస్తుంది.
- పియర్స్ లోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మరియు హానికర బ్యాక్టీరియా ని బయటకి పంపడానికి సులభతరం చేస్తుంది.
- ఇంకా ఈ పియర్ పండులో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కే, పొటాషియం ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా బోలు ఎముకల వ్యాధి రాకుండా, వచ్చే ప్రమాదాన్ని కూడ తగ్గిస్తుంది.
- ఈ పియర్ పండులో కాపర్ కూడా ఉంటుంది ఇది మెదడు పనితీరు మెరుగుపరచడమే కాకుండా మతిమరుపు రాకుండా చేయడంలోనూ, మానసిక స్పష్టతను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.
- పియర్ పండులో ఫోలేట్ ఉండటం వలన ఇది గర్భధారణ సమయంలోను, పిండం అభివృద్ధికి, శిశువుల మెదడు, వెన్నెముక అభివృద్ధికి ప్రోత్సహిస్తుంది.
- ఈ పియర్ పండును సలాడ్లోనూ, జ్యూస్గా గాని లేదా డిసర్ట్స్ , పాన్ కేక్స్ లో తీసుకోవచ్చు.
ముగింపు
ఈ పియర్ పండు కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు ఇందులో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఫోన్ లేట్ ఇవన్నీ ఉండడంవల్ల మన శరీరాన్ని కావలసిన అన్ని పోషకాలను అందించడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
Read More:-