ప్రస్తుత కాలంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు, కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల, తీవ్రమైన ఒత్తిడి వల్ల మన ఆరోగ్యానికి కావాల్సిన సమయాన్ని కేటాయించడం చాలా కష్టమైంది. ఆరోగ్యంగా ఉండటానికి సులభమైన మార్గాలు ఏంటంటే వ్యాయామం చేయడం, నడవడం లేదా పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం, అయితే పోషకాలు అన్నీ ఉండి ఆరోగ్యంగా ఫీట్ గా ఉంచే ఒక ముఖ్యమైన పోషకాల ఘని మొలకలు.
Table of Contents
మొలకలు అంటే ఏమిటి?
కాయ ధాన్యాలను రాత్రంతా నానబెట్టి, తరువాత ఒక రోజంతా ఒక గుడ్డలో పెట్టి ఉంచితే మొలకలు తయారవుతాయి. ఈ మొలకలలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్, కాల్షియం ప్రోటీన్ ఎంజైమ్ లతో కూడిన అద్భుతమైన నాచురల్ సూపర్ ఫుడ్. ఈ మొలకలు తృణధాన్యాలకు మరియు కాయ దాన్యాలకు సంబంధించినవి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటానికి శరీరం యొక్క అభివృద్ధికి చాలా సహాయం చేస్తాయి.
మొలలు నానబెట్టడం ఎందుకు తప్పనిసరి?
విత్తనాలను రాత్రంతా నానబెట్టి ఆ తర్వాత స్ప్రౌట్స్ మేకర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ, బౌల్ లో కానీ ఉంచితే అవి మొలకలుగా తయారవుతాయి. విత్తనాలను నానబెట్టడం ద్వారా అది పోషకాహారంగా క్రియాశీలంగా పనిచేస్తుంది, నిలువ చేయబడిన ప్రోటీన్లు, పోషకాలు, కార్బోహైడ్రేట్లు సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్నం చేసి వివిధ ఎంజైమాటిక్ కార్యక్రమాలను ప్రేరేపిస్తుంది.
ఈ విత్తనాలను లేదా గింజలను కలుషితం చేసే హానికరమైన రసాయనాలు తొలగించడానికి నానబెట్టడం ద్వారా అందులో ఉన్న రసాయనాలన్నీ పోవడం వల్ల విత్తనాల బయటి పొర కూడా మృదువుగా తయారవుతుంది.
చాలామందికి ఈ విత్తనాలు జీర్ణించుకోవడం అరగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కానీ నానబెట్టడం వల్ల ఆ గింజలు జీర్ణం చేయడానికి ఈజీ అవుతుంది. ఇంకా గ్యాస్ ఉత్పత్తి చేసే టార్చ్ ను తొలగించడమే కాకుండా పైటేట్లను విచ్ఛిన్నం చేయడానికి ఎంజైములను సక్రియం చేస్తుంది. ఇంకా వండడానికి కూడా తక్కువ టైం తీసుకోవడంతో పాటు శరీరం యొక్క అద్భుతమైన సోషణకు, జీవనశక్తిని పెంచడానికి నానబెట్టడం అనేది మంచిది.
Nutrients of Molakalu
- డైటరీ ఫైబర్
- ఫోలేట్
- నియాసిన్
- థయామిన్
- విటమిన్ సి
- విటమిన్ కె
- విటమిన్ ఏ
- జింక్
- మెగ్నీషియం
- కాల్షియం
- ఐరన్
Molakalu health benefits in telugu
- సాధారణంగా ఐరన్ లోపం వలన లేదా పోషకాల లోపం వలన రక్తహీనతకు దారితీస్తుంది తగినంత ఐరన్ తీసుకోకపోతే అది హిమాగ్లోబిన్ ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ తీసుకు వెళ్లదు. అయితే ఈ మొలకలలో రక్తహీనతను తగ్గించే పోషకాలు మరియు ఐరన్ అధికంగా ఉంది అంతేకాకుండా ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
- మొలకలలో ఫోలేట్ అనేది గణనీయమైన స్థాయిలో ఉండటం వలన న్యూరల్ ట్యూబ్ లోపాలను తగ్గించడమే కాకుండా శిశువు ఆరోగ్యాన్ని పిండం ఎదుగుదలకు గర్భిణీ స్త్రీలకు ఇది చాలా సహాయ పడుతుంది.
- మొలకలలో లైసెన్ అని పిలవబడే ఒక నిర్దిష్టమైన అమినో ఆమ్లం ఉండటం వలన ఇది జలుబు పుండ్లు వికారం తగ్గించడానికి సహాయం చేస్తుంది.
- Broccoli Sprouts వంటి కొన్ని రకాల మొలకలు ఆస్తమా, శ్వాసకోశ వ్యవస్థ, అలర్జీ ప్రతిచర్యలను తగ్గించడానికి దోహదం చేస్తుంది.
- మొలకలలో తక్కువ పిండి పదార్థాలు, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇవి గొప్ప వనరుగా పనిచేస్తాయి ఇవి తీసుకోవడం వలన ఆకలి తక్కువ అవడం వలన బరువు తగ్గడంలో బాగా సహాయపడుతూ ఉంది. 100 గ్రాముల మొలకల లో కేవలం 100 క్యాలరీలు మాత్రమే ఉండటం వలన మన శరీరానికి అవసరమైన పోషకాలతో ఇది నిండుగా ఉంది.
- మొలకలలో ఫైబర్ అధికంగా ఉండటం వలన సహజ డైజెస్ట్ బ్యాక్టీరియా పనిచేయడమే కాకుండా సులభంగా జీర్ణం చేయడానికి, ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచడానికి, అతిగా తినడానికి నిరోధించడానికి ఇది మంచి చిరుతిండిగా తీసుకోవచ్చు.
- చాలామంది మాంసం పాలు గుడ్లు ఉత్పత్తుల్లో మాత్రమే ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి అనుకుంటారు కానీ మొలకెత్తిన గింజలు చిక్కుళ్ళు బీన్స్ వంటి వాటిలో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ మొలకలలో ప్రోటీన్ అనేది నిండుగా ఉండటం వలన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి బాగా సహాయపడుతుంది.
- మొలకలలో అధిక ఫైబర్, తక్కువ కొవ్వు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
- మొలకెత్తిన విత్తనాలలో శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన తెల్ల రక్త కణాల వ్యాధులతో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇది సహాయం చేస్తుంది.
- అంతేకాకుండా ఈ మొలకలలో క్లోరోఫిల్ కూడా ఉండటం వలన శరీరంలోని చెడు వ్యర్ధాలను తొలగించడానికి ఈ విషయాన్ని తొలగించడానికి శరీరాన్ని శుభ్రపరచడానికి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని అరికట్టడానికి బాగా సహాయపడుతుంది.
- మొలకలలో విటమిన్ ఏ కూడా ఉంటుంది కాబట్టి ఇది కంటి చూపుని మెరుగుపరచడానికి, కంటి కణాలను రక్షించడానికి, రేచీకటి మరియు కంటి శుక్లాం ఏర్పడకుండా ఉండటానికి, కంటి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని రాకుండా చేయడానికి దోహదం చేస్తుంది.
- మొలకలలో పోషకాలు ఉన్నప్పటికీ అవి తేమా చీకటి ప్రదేశాలలో పెరగడం వలన ఫంగస్తులు బ్యాక్టీరియాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తినే ముందు వీటిని శుభ్రంగా కడుక్కొని తినడం వలన శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కారణం కాకుండా ఉంటుంది.
ముగింపు
మొలకలలో అనేక పోషకాహారాలు, శరీరానికి అవసరమయ్యే అన్ని వ్యాధుల నివారణ కు అవసరం అయ్యే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వాటిని మీ ఆహారంలో చేర్చుకొని మీ అభిరుచికి అనుగుణంగా సలాడ్స్ రూపంలో కానీ లేదంటే స్నాక్స్ రూపంలో కానీ తీసుకోండి.
Read More:-