How to Grow Dragon Fruits plant 10+ best tips in Telugu

Dragon fruits మొక్క అనేది ఒక పెద్ద మరియు క్లైంబింగ్ కాక్టస్ మొక్క, చాలా పొడవుగా, మందంగా మరియు ఎంతో పొడవు కలిగిన కొమ్మలుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ డ్రాగన్ పండ్లు ప్రకాశవంతమైన పసుపు లేదా ఎర్రటి ఎరుపు పండ్లను కలిగి ఉంటాయి. అనేక ప్రాంతాలలో డ్రాగన్ చెట్టు పండు ను పిటాయా, స్ట్రాబెర్రీ పియర్ లేదా కాక్టస్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, పిటాహయ అనే పేర్లతో పిలుస్తారు. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ని పచ్చిగా తినడానికి, స్మూతీస్ లేదా ఐస్ క్రీం తయారు చేసే వాటిల్లో కలపడానికి, సూప్ లలో వేయడానికి చాలా బాగుంటుంది.

పైన చెప్పిన అంశాలే కాకుండా , Pitaya మొక్కలు ప్రపంచంలోని అన్నిటి కంటే అతిపెద్ద పువ్వులు పూస్తాయి, ఈ పుష్పాలను నైట్-బ్లూమింగ్ సెరియస్ అని అంటారు. ఈ డ్రాగన్ చెట్టు పూలు రాత్రి మాత్రమే స్వచ్చని తెల్లని పువ్వులుగా మరియు అందం గా వికసిస్తాయి.

Types of Dragon Fruits in Telugu

హైలోసెరియస్ ఉండటస్:- ఈ డ్రాగన్ ఫ్రూట్ పై భాగం గులాబీ రంగు లేదా ఎరుపు చర్మం మరియు లోపల తెల్లని గుజ్జు ఉంటుంది.

హైలోసెరియస్ మెగాలాంథస్ :- ఈ డ్రాగన్ ఫ్రూట్ పై భాగం పసుపు రంగు కలిగి వుండి మరియు లోపల తెల్లని గుజ్జు ఉంటుంది.

హైలోసెరియస్ కోస్టారిసెన్సిస్:- ఈ డ్రాగన్ ఫ్రూట్ పై భాగం ఎర్రటి చర్మం మరియు లోపల ఎరుపు లేదా బూడిద రంగు గుజ్జు ఉంటుంది.

dragon fruits  plant

How to Grow Dragon Fruits plant in Telugu?

డ్రాగన్ మొక్కలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉష్ణమండల ప్రాంతాలు, తక్కువ తేమతో కూడిన వాతావరణంలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎక్కువగా దక్షిణ అమెరికా మరియు మధ్య అమెరికా లో ఎక్కువగా పండిస్తుంటారు, ఎందుకంటే ఈ ప్రదేశాలు ఎక్కువ ఉష్ణమండల ప్రాంతాలు.

మీరు స్వయంగా మీ ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్క ని పెంచాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్‌ని కొనుగోలు చేసి దాని విత్తనాలను ఎక్కువగా పొగుచేసి, ఎండబెట్టి విత్తనాలను నాటండి. ఈ డ్రాగన్ చెట్టు పెరిగి పెద్దదై పండ్లు రావడానికి సుమారు 5 నుండి 6 సంవత్సరాలు పడుతుంది .

మొద‌ట‌గా రెండు పెద్ద ప్లాస్టిక్ బకెట్స్ లేదా డ్రమ్ములు ఏర్పాటు చేసుకొని, అందులో కొబ్బ‌రిపీచు, ఎర్ర మ‌ట్టి, కంపోస్ట్ ఎరువుతో పాటు ఇసుక‌ను నింపాలి, ఆ త‌ర్వాత ఎండబెట్టిన డ్రాగ‌న్ విత్తనాలు కానీ, మొక్క‌ను కానీ నాటాలి. ఇంక మంచి వెలుతురు, ఎండ పుష్క‌లంగా తగిలే ప్రదేశం లో ఆ డ్ర‌మ్మును ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ డ్రాగన్ మొక్క పెరుగుద‌ల‌కు వాటర్ ఎక్కువ‌గా అవ‌స‌రం ఉండదు కాబట్టి డ్రాగన్ మొక్క ఒక‌సారి పెర‌గ‌డం ప్రారంభ‌మైన త‌ర్వాత‌, దీనికి ఒక క‌ర్ర‌ను జ‌త చేసి క‌ట్టాలి.

ఈ డ్రాగన్ మొక్క పెరిగిన త‌ర్వాత దానికి పూలు పూస్తాయి, ఆడ పుష్పం పుప్పొడిని మ‌గ పుష్పంపై చ‌ల్లడం వలన ఫ‌ల‌దీక‌ర‌ణం చెంది పండుగా మారుతుంది.

కీటకాల, చీడ‌పీడ‌ల నుండి డ్రాగన్ మొక్కను కాపాడటానికి ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువుల‌ను కూడా ఉప‌యోగించొచ్చు.

డ్రాగన్ పువ్వులు ఆర్కిడ్ కాక్టస్ వలె మిడ్ నైట్ విచ్చుకొని ఉదయానికి వాలిపోయి, పువ్వు రాలిన నెలకు డ్రాగన్ పండు పక్వానికి వస్తుంది.

బాగా పండిన మొక్క యొక్క ఒక కొమ్మను 10 నుండి 12 అంగుళాల వరకు కత్తిరించి, కొమ్మను మొక్క నుండి పై భాగం వేరుచేయ్యండి. అలా వేరు చేసిన మొక్కను ఎక్కువగా పట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువగా కత్తిరిస్తే దాని పెరుగుదల తగ్గుతుంది, కనుక మొక్కని జాగ్రత్తగా కట్ చేయడం మంచిది.

మీరు కట్ చేసిన డ్రాగన్ మొక్కలను ఎలా నాటాలంటే, నేల క్రింద ఒక అంగుళం లేదా రెండు అంగుళం తవ్వి దానిలో ఇది ఉంచి దాని చుట్టూ ఉన్న మట్టిని బాగా నొక్కడం ద్వారా నిటారుగా ఉంచడం జరుగుతుంది.

డ్రాగన్ మొక్కలు హెక్టారుకు 1,100 మరియు 1,350 మధ్య అధిక సాంద్రతతో వాణిజ్య మొక్కలు నాటవచ్చు. మొక్కలు పూర్తి వాణిజ్య ఉత్పత్తికి రావడానికి ఐదు సంవత్సరాలు పట్టవచ్చు, ఆ దశలో 20 నుండి 30 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది.

Dragon Fruit Harvesting in Telugu

మీరు పెంచిన డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఫలాలను ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఆ చెట్టు కాయలను కోయడం చాలా సులభం. చెట్టు రెక్కలు మరియు పండు బయటి చర్మం వాడిపోవడం ప్రారంభించిన వాటిని త్వరగా కోయాలి. ముందు మంచి రంగు గల మరియు చూడడానికి బాగా ఉన్న పండ్ల కోసం తోటలో చూడాలి. మీరు ఈ డ్రాగన్ పండ్లను చాలా సున్నితంగా కోయాలి. మీరు కొస్తునపుడు అది పక్వానికి వచ్చినట్లయితే, ఆ పండు కాండం నుండి సులభంగా అది ఊడి వస్తుంది. మీరు తెంపినప్పుడు పండు దాని స్వంతంగా కాండం నుండి బైటికి పడే వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. డ్రాగన్ పండు వెంటనే బైటికి వస్తే అది బాగా పండినది అని అర్థం.

ఈ తీయని డ్రాగన్ పండ్లు బయట కొద్దిరోజులు మాత్రమే ఉంటాయి. అదే చాలా ఎక్కువ రోజులు కావాలి అంటే రిఫ్రిజిరేటర్‌ లో ఉంచితే రెండు నుండి మూడు వారాల వరకు ఉంటాయి.

Read More:-

Dragon fruit health benefits in Telugu

Pacha Karpooram Health Benefits in Telugu

Leave a Comment