శతాబ్దాలుగా వినియోగించబడుతున్న Green Tea చైనా మరియు భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు, ఇది అత్యంత విస్తృతంగా వినియోగించబడే పానీయాలలో ఒకటి, ఇందులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. గ్రీన్ టీ పొడి అనేది ఆక్సీకరణం చెందని టీ ఆకుల నుండి తయారవుతుంది ఇందులో అనామల జనకాలు మరియు పాలిఫెనాల్స్ సమృద్ధిగా ఉండటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నాయి.
ఈ సమగ్ర గైడ్ లో నేను గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా వివరిస్తున్నాను.
Table of Contents
Health Benefits of Green Tea in Telugu
- Green Tea లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన గుండె జబ్బులు క్యాన్సర్ వృద్ధాప్యం వంటి దీర్ఘకాలిక వ్యాధులనుండి రక్షించడానికి సహాయపడుతుంది.
- గ్రీన్ టీ లో ఏపిగాల్లో కాటేచిన్ గాలెట్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉండుటవలన వివిధ రకాల వ్యాధులతో పోరాడగల సామర్థ్యం ఉంది అని అధ్యయనం తెలుపుతుంది. ఇంకా ఈజిసిజి యాంటీ ఆక్సిడెంట్ కణాల పెరుగుదలకు మద్దతు ఇవ్వడం, క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించడం, వాపును తగ్గించడం వంటి వాటికి సహాయ పడుతుంది.
- గ్రీన్ టీ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడటం కాలుష్యం మరియు ఇతర పర్యావరణ ఒత్తిళ్ళ వల్ల కలిగే నష్టాన్ని రక్షించడానికి సహాయపడతాయి. ఈ గ్రీన్ టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముడతలు రాకుండా, చక్కటి గీతలు వృద్ధాప్యం రాకుండా ఉండటానికి, యవ్వన చర్మం ఉండటానికి దోహద పడుతుంది.
- ఈజిసిజి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి క్యాన్సర్ నుండి రక్షించడానికి సహాయపడుతుంది అని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. కాకపోతే ఇంకా మరికొంత పరిశోధన అవసరం అయినప్పటికీ కొన్ని అధ్యాయాలు కొలొరెక్టల్, ప్రొస్టేట్ , రొమ్ము క్యాన్సర్ ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నాయి.
- గ్రీన్ టీ ని తరచుగా వాడటం వలన జీవక్రియను పెంచి కొలెస్ట్రాల్ ని, కొవ్వుని బర్న్ చేసి బరువు తగ్గిస్తుంది అని తెలుపుతున్నారు. ఈ గ్రీన్ టీ తాగడం వలన 17 పర్సంటేజ్ ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీ లో ఉండే కెఫిన్ మరియు కాటేచిన్ లు ధర్మోజినిస్ ను ప్రోత్సహించి శరీరం వేడిని ఉత్పత్తి చేయడానికి దాని వలన క్యాలరీలను బాగు చేయడానికి సహాయపడుతుంది అని పరిశోధనలు తెలుపుతున్నాయి.
- గ్రీన్ టీ లో ఉండే కాటే చిన్స్ మరియు కెఫెన్ ఉండటం వలన కొవ్వు ఆక్సీకరణను పెంచడానికి, శక్తి వ్యయాన్ని పెంచడానికి పనిచేస్తుంది.
- బెల్లీ ఫ్యాట్ అధికంగా ఉన్నవారు ఈ గ్రీన్ టీ ని తాగడం వలన కొవ్వును ఆక్సీకరణం చేసి శరీర సామర్థ్యాన్ని పెంచి ముఖ్యంగా కొవ్వును విచ్చిన్నం చేసి తగ్గిస్తుంది.
- గ్రీన్ టీ అనేది ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేసి ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది అని క్రేవింగ్స్ ను అణచివేసే సామర్థ్యం ఉంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
- ఈరోజుల్లో గుండె జబ్బులు వలన సడన్గా చాలామంది ప్రమాదంలో పడుతున్నారు అయితే ఇవి రాకుండా జాగ్రత్త పడాలంటే కొన్ని ఇంట్లోనే హెల్తీ ఫుడ్ తీసుకోవడం వలన వీటి బారిన పడకుండా ఉండవచ్చు. ఈ హెల్తీ ఫుడ్ లో గ్రీన్ టీ అనేది ఒకటి, ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ముందే గుండె జబ్బులు, హృదయ సంబంధ ప్రమాదాలు, స్ట్రోక్స్ తక్కువగా ఉండేలా చూస్తుంది.
- ఈ గ్రీన్ టీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అని ఒక పరిశోధన లో వెలువడింది.
- ఈ గ్రీన్ టీ కి తేలికపాటి రక్తపోటుని తగ్గించే ప్రభావం ఉంది అని, రక్తనాళాలను సడలించడంలో సహాయపడుతుంది అని, ఇంకా రక్తప్రసరణ మెరుగుపరచడంలో, గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా దోహదం చేస్తుంది అని పరిశోధకులు తెలుపుతున్నారు.
- రీసెర్చ్ లో భాగంగా రెగ్యులర్గా గ్రీన్ టీ తాగిన వారి కి స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇది రక్త ప్రసరణ బాగా మెరుగుపరుస్తుందని, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని చెబుతున్నారు.
- గ్రీన్ టీ లో బయో ఆక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన ఇది మెదడుపై శక్తివంతమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. గ్రీన్ టీ లో ఉండే ఎల్ థియనైన్ అనే అమినో యాసిడ్ మరియు కెఫిన్ కలయిక వలన మనసు ప్రశాంతంగా ఉంచడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి ప్రత్యేకమైన సినర్జీని అందిస్తుంది.
- గ్రీన్ టీ చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మం మృదువుగా ఉండేలా, ముడతలను తగ్గించి, చర్మవ్యాధులను న్యాయం చేయడానికి సహయ పడుతుంది.
- గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మొటిమలు మంట వాపు విరోచనాలని తగ్గించడానికి ఇంకా అతినీలలోహిత కిరణాల నుండి కాపాడటానికి సహాయపడుతుంది.
- ఈ గ్రీన్ టీ పిల్లలు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు తీసుకోకుండా ఉంటే మంచిది ఇంకా ఎవరైనా ఎలర్జీ కానీ మరి ఏదైనా రియాక్షన్ ఉన్నవారు డాక్టర్లను సంప్రదించి తీసుకుంటే మంచిది.
ముగింపు
గ్రీన్ టీ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన ఈ పానీయం తాగటం వలన మన ఆరోగ్యనికి శ్రేయస్సుకి, గుండె, మెదడును రక్షించడానికి, బరువు తగ్గించడానికి, మెరుగైన చర్మాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
Read More:-