మన జీవనానికి మొక్కలు అనేవి జీవన ఆధారం, ఇవి పోషక ఆహారానికి పెద్ద మూలం, అంతే కాకుండా ఈ మొక్కలు మనకు అవసరం అయ్యే ఖనిజాలు, విటమిన్లు అందిస్తాయి. ఈ మొక్కలు మరియు కూరగాయల లో ఒకటి అయిన అధిక పోషకాలు ఇచ్చే మొక్క Broccoli. ఈ బ్రోకలీ కి ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాల వలన దీనిని సూపర్ ఫుడ్ అని చెప్పబడుతుంది. దీనిని శాస్త్రీయం గా బ్రాసికా ఒలేరాసియా అని పిలుస్తారు, రోమన్ సామ్రాజ్యం రోజుల నాటి నుండి ఇది విలువైన ఆహార పదార్ధం గా చెప్పబడుతుంది.
Broccoli మధ్య ధరా ప్రాంతాల లో పెరిగిన ప్రస్తుత బ్రాసికా పంటల ఫలితం గా ఉత్పత్తి చేయబడిందని చెప్తున్నారు. ఇది బ్రొక్కోలో అనే రోమ్ పదం నుండి తీసుకోవడం జరిగింది, ఇది క్యాలి ప్లవర్ వలె కనిపిస్తుంది, ఇది గోబీ కుటుంబానికి చెందినది, అంతే కాకూండా అత్యంత పోషకాలు ఉన్న క్రూసి ఫెరస్ వెజిటేబుల్స్ లో ఒకటి.
ఈ Broccoli తూర్పు మధ్య ధర ప్రాంతం నుండి పుట్టింది, తరువాత ఇటలీ లో బాగా పాపులర్ అయింది, ఇప్పుడు ప్రపంచం అంతటా పేరు పొంది అన్ని ప్రాంతాల లో ఉపయోగిస్తున్నారు.
ఇది 18°C నుండి 23°C మధ్య ఉష్ణోగ్రత లో మాత్రమే పెరిగే అవకాశం ఉన్నందున శీతాకాలం లో మాత్రమే పండే చాన్సు ఉంది, వేసవి లో పండే అవకాశం లేదు. ఇది ముదురు ఆకు పచ్చ రంగు లో పెద్ద పెద్ద పువ్వు లాగా నిజానికి చూడటానికి క్యాలి ఫ్లవర్ లాగానే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ పువ్వు కొనేటప్పుడు పసుపు రంగు లో ఉంటె అస్సలు కొనవద్దు, దానికి దూరం గా ఉంటె మంచిది.
Table of Contents
Broccoli Health Benefits in Telugu
- బ్రొకోలి లో కాల్షియం, విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, పాస్ఫరస్, విటమిన్ కె, విటమిన్ బి 6 మరియు సెలీనియం నిండు గా ఉన్నాయి. అంతే కాకుండా ఫ్లేవనాయిడ్లు, ఫైటో న్యిట్రియెంట్ గ్లూకోసినోలేట్స్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
- బ్రొకోలిలో ఒమేగా 3 ఫ్యాట్ ఆసిడ్స్ అధిక స్థాయి లో ఉండుట వలన అర్ధ రైటిస్, ఉబ్బసం మరియు ఇతర అలెర్జీ వ్యాధులతో బాధ పడే వారికి సహాయ పడుతుంది.
- ఈ బ్రొకోలి లో తక్కువ క్యాలరీ లు ఉన్నందున బరువు తగ్గ టానికి సహాయ పడుతుంది, ఇంకా ఇందులో ఫైబర్ కూడా తక్కువ గా ఉంటుంది.
- బ్రొకోలి లో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉండుట వలన అతి నీల లోహిత కిరణం నుండి కళ్ళను రక్షిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ , ఫాస్పరస్, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి చాలా మంచివి.
- ఇందులో స్లపొర్ఫెనే శోథ నిరోధక లక్షణాలు ఉండటం వలన రక్తం లో చక్కర వల్ల వచ్చే మంట వళ్ళ కలిగే రక్త నాళాల లైనింగ్ దెబ్బ తినకుండా నిరోధించడానికి సహాయ పడుతుంది.
- బ్రొకోలి లో కాల్షియం, విటమిన్ కె అధికం గ ఉండుట వల్ల ఎముకల ఆరోగ్యానికి, బోలు ఎముకల వ్యాధి ని నివారించడానికి సహాయ పడుతుంది.
- ఇందులో ఫైబర్ పుష్కలం గా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ లో విషాన్ని తొలగించడానికి సహాయ పడుతుంది. ఇంకా ఇందులో ఫైటోన్యూట్రియెంట్లు ఉండుట వలన శరీరం యొక్క డీటాక్స్ ప్రక్రియ కి సహాయ పడుతుంది.
- బ్రొకోలి లో గ్లూకోరఫానిన్ , బయో యాక్టీవ్ సమ్మేళనాలు ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది.
- ఇది ఉత్తమమైన ఆహారం అని ప్రయోగాత్మక అధ్యయనాల లో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని సూచిస్తుంది. 2011, 2012 మధ్య జరిగిన ఒక వైద్య పరిశోధన లో బ్రొకోలి తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని నిరూపించబడింది మరియు జీవక్రియ ని పునరుద్ధరించడానికి సహాయ పడుతుంది.
- ఇందులో పీచు పదార్ధాలు అధికం గా ఉండుట వలన శరీరం యొక్క జీర్ణ క్రియ ని నిర్వహించడానికి అద్భుతం గా సహాయం చేస్తుంది. ఇందులోని బయో యాక్టీవ్ సమ్మేళనం కడుపు లోపలి పొర ని సురక్షితం గా రక్షిస్తుంది మరియు ప్రేగుల లో మంచి బ్యాక్టీరియా స్థాయిల్ని నిర్వహిస్తుంది.
- 2015 లో నిర్వహించిన ఒక పరి శోధన లో పచ్చి బ్రొకోలి జ్యుస్ మతి మరుపు ని తగ్గిస్తుంది అని నిరూపించ బడింది.
- ఇందులో ఉండే అత్యధిక స్థాయి యాంటీ ఆక్సిడెంట్స్ అనామ్ల జనకాలు ఆక్సీకరణ ఒత్తిడి వలన ఏర్పడే సెల్ల్యులర్ నష్టాన్ని ఆలస్యం చేస్తాయి.
- బ్రొకోలీ లో విటమిన్ ఎ నిండు గా ఉండటం వలన కంటి కి ఆరోగ్య కరం గా ఉంటుంది, సరైన కంటి దృష్టి కి అవసరమైన కణాల అభివృద్ధి కి ఇది చాలా అవసరం.
- ఇది ఇన్సులిన్ నిరోధకత ని మెరుగు పరచడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి స్థాయి ని తగ్గించడం వలన డయాబెటిస్ ని తగ్గిస్తుంది అని బ్రొకోలి పై జరిగే పరిశోధనల లో కనుగొన్నారు.
ముగింపు
బ్రొకోలి లో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి ఇంకా కేలరీలు తక్కువగా ఉన్నాయి.
Read More:-