దక్షిణ అమెరికా లో ఉన్న అమెజాన్ ఫారెస్ట్ లో Brazil nuts అనేవి ఎక్కువ గా పెరుగుతాయి. బ్రెజిల్ గింజలు ప్రత్యేకించి బొలీవియా, బ్రెజిల్ మరియు పెరూ కి చెందినవి. ఇవి చూడటానికి బాదాం కంటే కొంచెం పెద్దవి గా, తాకినపుడు ఆయిలీ గా అనిపిస్తాయి. ఇవి తింటుంటే కొంచెం బాదాం, వాల్ నట్స్, కొబ్బరి ముక్కలా రుచి గా అనిపిస్తుంది. ఈ బ్రెజిల్ నట్స్ ని ప్రతి రోజు ఒకటి లేదా రెండు వాటర్ లో రాత్రంతా 12 గంటలు నానబెట్టి ఉదయాన్నే పై స్కిన్ తీసేసి తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
మన ఆరోగ్యాన్ని కాపాడటానికి బ్రెజిల్ నట్స్ అనేక రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి.
బ్రెజిల్ నట్స్ అనేవి ప్రకృతి ప్రసాదించిన అనేక గింజల లో అన్నిటి కంటే గొప్ప విత్తనాలు, ప్రకృతి లో ఈ విత్తనాల కంటే బలమైన విత్తనాలు మరొకటి లేవు.
Nutrients of Brazil Nuts in Telugu
- ఫ్యాట్ – 66గ్రామ్స్
- ప్రోటీన్ – 14గ్రామ్స్
- కార్బో హైడ్రాట్స్ – 12గ్రామ్స్
- ఫైబర్ – 7.5 గ్రామ్స్
- సెలీనియం
Table of Contents
Brazil nuts Health Benefits in Telugu
- బ్రెజిల్ నట్స్ ని రోజుకి ఒకటి లేదా రెండు తీసుకోవడం వలన మెరుగైన గుండె ఆరోగ్యం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అనేక విధాలుగా సహాయ పడుతుంది.
- Brazil Nuts లో ఉండే సెలీనియం అనేది థైరాయిడ్ గ్రంధి జీవక్రియ మరియు అభివృద్ధిని నియంత్రించ గలిగే హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి కీలక పాత్ర వహిస్తుంది. థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయకపోతే అలసట, బరువు పెరగడం మరియు స్ట్రెస్, నిద్ర లేకపోవడం వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక సెలీనియం ఉన్న ఆహారాల ను తీసుకోవడం వలన థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగు పడుతుంది.
- ఒక పరిశోధనలో థైరాయిడ్ గ్రంధి వ్యాధి కి సెలీనియం లోపం అనేది ఒక ముఖ్యమైన ప్రమాద కారకం అని గ్రహించబడింది. మన శరీరానికి సెలీనియం తక్కువ మోతదుల్లో మాత్రమే అవసరం, ఎక్కువ మోతాదు లో సెలీనియం తీసుకుంటే అది విషపూరితం అయ్యే అవకాశం ఉంది కనుక బ్రెజిల్ గింజలను తక్కువ తీసుకుంటే మంచిది.
- ఈ బ్రెజిల్ గింజల లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరియు ఖనిజాలతో సహా ఉండటం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయ పడుతుంది.
- బ్రెజిల్ గింజలలో ఉన్న మోనో అన్‌శాచురేటెడ్ మరియు బహుళ అసంతృప్త ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు చాలా మంచివి, ఎందుకంటే ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయం అందిస్తాయి. ప్రతి రోజు బ్రెజిల్ గింజలను ఒకటీ లేదా రెండు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చని, గుండె జబ్బులను నివారించడానికి సహాయ పడతాయి అని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
- యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తో పాటు బ్రెజిల్ గింజలు లో పొటాషియం మరియు మెగ్నీషియం వంటి మన శరీరానికి అవసరమైన ఖనిజాలను కూడా కలిగి ఉంది. ఈ మినరల్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగ పడతాయి.
- ఈ బ్రెజిల్ నట్స్ లోని ఫైబర్ అనేది మన శరీరానికి ఒక ముఖ్యమైన పోషకం, ఇది బరువు తగ్గడానికి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడంలో మనకు సహాయపడుతుంది.
- బ్రెజిల్ నట్స్ లో ఫైబర్ అనేది ప్రతి కప్పు కి 2.1 గ్రాములను కలిగి ఉండటం వలన బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.
- బ్రెజిల్ గింజలు లో ప్రతి వంద గ్రాముల కు 14 గ్రాముల ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది కాబట్టి, ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు గొప్ప మూలం.
- బ్రెజిల్ గింజల లోని సెలీనియం తెల్ల రక్త కణాల కార్యకలాపాలను మెరుగుపరచి, అంటువ్యాధులు మరియు వ్యాధులతో పోరాడటానికి కీలక పాత్ర వహిస్తుంది అని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
- రోజుకు రెండు బ్రెజిల్ గింజలను తీసుకోవడం వలన శరీరానికి అవసరమయ్యే రోజువారీ సెలీనియం అందిస్తుంది. బ్రెజిల్ గింజల లో యాంటీఆక్సిడెంట్లు అధికం గా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి సహాయపడుతుంది.
- బ్రెజిల్ గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న గొప్ప ఘని, ముఖ్యంగా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వలన మెదడు పనితీరుకు కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా ఒమేగా 3 ఫాట్స్ ఆందోళనను తగ్గించటానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, జ్ఞాపక శక్తి ని మెరుగుపరుస్తాయి.
- బ్రెజిల్ నట్స్‌లో ఉన్న విటమిన్ మెదడును కాపాడ టానికి, న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల అభివృద్ధికి, వృద్ధులలో జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు బ్రెయిన్ డెడ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ముగింపు:-
బ్రెజిల్ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ, వీటిని మితంగా తీసుకోవాలని గమనించుకోండి, ఎందుకంటే వీటిలో సెలీనియం మరియు కేలరీలు అధికంగా ఉంటాయి.
Read More:-