Lakshman Phal Juice లో పోషకాలు ఫైటో కెమికల్స్ ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ జ్యూస్ లో ఉన్నాయి. ఈ లక్ష్మణ్ పండు అనేది మొదటగా మద్య మరియు దక్షిణ అమెరికాకు చెందిన పండు కానీ ఇప్పుడు ఇది మన భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ ఉష్ణ మండల ప్రాంతాల్లో సాగు చేయబడుతుంది.
ఈ లక్ష్మణ్ పండు జ్యూస్ లో మినరల్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు డైటరీ ఫైబర్ తో సహా అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్లో లక్ష్మణ్ పండు జ్యూస్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు న్యూట్రియన్స్, గుండె ఆరోగ్యం ఇంకా జీర్ణ ఆరోగ్యం, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు ఈ పండుతో ఎలా పనిచేస్తుందో చూద్దామ్.
Table of Contents
Lakshman Phal Juice Nutrients
- విటమిన్ సి
- బి – విటమిన్లు
- పొటాషియం
- మాగ్నేసియమ్
- యాంటీ ఆక్సిడెంట్లు
Lakshman Phal Juice Health Benefits
- Lakshman Phal Juice లో విటమిన్ సి అధికంగా గా ఉండటం వలన ఇది రోగ నిరోధక వ్యవస్థ ని బలం గా చేసే ప్రాధమిక ఆరోగ్య ప్రయోజనాల లో ఇది ఒకటి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తి ని పెంచడానికి, హానికరమైన బ్యాక్తీరియా ని చంపడానికి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
- ఈ లక్ష్మణ్ పండు జ్యూస్ లో ఫ్లేవనాయిడ్స్ , కెరోటినాయిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉండటం వలన అవి శరీరం లో ఫ్రీ రాడికల్స్ ని తటస్థీకరించి అస్థిర అణువులు , కణాలను , దెబ్బ తీస్తాయి.
- ఈ లక్ష్మణ్ పండు జ్యూస్ అనేది మన శరీరంలోని కణజాలాల ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడానికి సహాయపడుతుంది దానివలన రోగనిరోధక వ్యవస్థకు సపోర్టు ఇస్తుంది.
- ఈ లక్ష్మణ్ ఫల్ జ్యూస్ అనేది మన ఆహారంలో చేర్చుకోవడం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇంకా కార్డియా వాస్కులర్ డిసీజ్ ను తగ్గించడానికి సహాయం చేస్తుంది.
- ఈ లక్ష్మణ్ ఫల్ జ్యూస్ లో ఉండే పొటాషియం అనేది అధిక స్థాయి లో ఉండటం వలన ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి, రక్త నాళాల గోడలను సడలించి, ఇంకా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- ఈ లక్ష్మణ్ పండు జ్యూస్ లో ఉండే మెగ్నీషియం అనేది గుండె ఆరోగ్యంలో కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది, ధమనులలో క్యాల్షియం పేరుకుపోకుండా నిరోధిస్తుంది, ఇంకా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది.
- లక్ష్మణ్ ఫల్ జ్యూస్ లో ఉండే డైటరీ ఫైబర్ అనేది ప్రయోగ కదలికలను ప్రోత్సహించి దానిద్వారా మలబద్ధకాన్ని నివారించడానికి ఇంకా జీర్ణ సమస్యలను దూరం చేయడానికి కూడా మద్దతు ఇస్తుంది.
- ఈ లక్ష్మణ్ ఫల్ రసం అనేది మన శరీరంలోని అదనపు టాక్సిన్స్ వ్యర్థాలను వదిలించుకోవడానికి సహాయపడటమే కాకుండా మూత్రపిండాలు కాలేయం నుండి కూడా హానికరమైన పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
- ఈ లక్ష్మణ్ ఫల్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి అనేది కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఇంక వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండడానికి ముడతలు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.
- ఈ లక్ష్మణ్ ఫల్ జ్యూస్ తాగడం వల్ల చర్మం నిగారిస్తూ పొడిబారక్కుండా ఉండటానికి ఇంకా పొట్టును నివారించడానికి చర్మానికి సహజంలో రావడానికి ప్రోత్సహిస్తుంది.
- ఈ లక్ష్మణ్ ఫల్ జ్యూస్ లో ఉండే క్యాల్షియం మెగ్నీషియం ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఇంకా బోలు వ్యాధులను ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
- ఈ లక్ష్మణ్ ఫల్ జ్యూస్ లో క్యాలరీలు తక్కువగా ఉండటం వలన త్వరగా ఆకలి కాకుండా చేస్తుంది ఇంకా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇంకా మనకు పొట్ట అనేది ఫ్రీగా ఉన్నట్లు చేస్తుంది.
- ఈ లక్ష్మణ్ ఫల్ రసంలో ఐరన్ అనేది అధికంగా ఉండటం వలన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది అంతేకాకుండా తగినంత స్థాయిలో ఐరన్ లేని వారికి ఇది చాలా మంచిది ఇంకా అలసటను నిరోధిస్తుంది ఆక్సిజన్ ను అందేలా చేస్తుంది.
- ఇది తియ్యగా ఉంటుంది అనేసి కొంతమంది అపోహ పడతారు షుగర్ వస్తుంది ఏమో అని కానీ ఇది చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయం చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి రక్తంలో షుగర్ స్థాయిలను పెంచకుండా ఉండడానికి నిరోధించడానికి అనుకూలంగా ఉంటుంది.
మీ డైట్లో లక్ష్మణ్ ఫల్ రసాన్ని ఎలా చేర్చుకోవాలి
- ఈ లక్ష్మణ్ ఫల్ జ్యూస్ విడిగా అయినా తీసుకోవచ్చు లేదా వేరే జ్యూస్ లో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇది రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల చాలా ఎనర్జీ అనేది వస్తుంది ఇంకా పోషకాలు కూడా మన శరీరానికి కావలసినవి అందుతాయి ఇంకా వేసవిలో అయితే మనకి ఇంకా చల్లగా అనిపిస్తుంది.
- ఇంకా ఈ లక్ష్మణ్ ఫల్ జ్యూస్ ని మనం ఐస్ క్రీమ్ సో డిజార్టీ వాటిల్లో కూడా కలిపి తీసుకోవచ్చు.
లక్ష్మణ్ ఫల్ జ్యూస్ యొక్క సంభావ్య సైడ్ ఎఫెక్ట్స్
ఈ లక్ష్మణ్ ఫల్ జ్యూస్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది రక్తంలో చక్కెర పెరుగుదలకు దోహదపడుతుంది, కనుక మితంగా తీసుకోవడం అనేది చాలా అవసరం.
కొంతమందికి కొన్ని ఫ్రూట్స్ అనేవి ఎలర్జీ వస్తాయి కనుక ఎవరైనా ఎలర్జీ ఎఫెక్ట్ అనిపిస్తే అది తీసుకోకుండా ఉండటం మంచిది.
ముగింపు
లక్ష్మణ్ ఫల్ జ్యూస్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాకుండా తగినన్ని పోషకాలు అందించడం రోగనిరోధక వ్యవస్థను పెంచడం ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అంటే అనేక ప్రయోజనాలను మనకు అందిస్తుంది.
Read More:-