Best 10+ Tips to repair refrigerator at home Telugu

Refrigerator అనేది ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే నిత్య అవసర వస్తువు. ఈ ఫ్రిడ్జ్ లో తక్కువ ఉష్ణోగ్రత ఉండటం వలన ఆహార సంరక్షణ ని నిర్వహిస్తుంది. పాడయిపోయే ఆహార పదార్ధాలను తాజా ఉంచడం నుండి మిగిలిపోయిన వాటిని నిల్వ చేయడం వరకు ఈ వస్తువు కీలక పాత్రా పోషిస్తుంది. అయినప్పటికీ మిగతా ఉపకరణాల వలె ఇది కూడా అరిగిపోయే అవకాశం ఉంది, మరియు సంవత్సరాలు పెరిగే కొద్దీ ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సమస్యలకు ప్రొఫెషనల్స్ అవసరం ఉంటే చాలా వరకు దాని గురించి సరైన జ్ఞానం మరియు పనిముట్ల తో ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు.

ఈ బ్లాగ్ లో నేను రిఫ్రిజిరేటర్ రిపేర్ గురించిన అంశాలను వివరిస్తున్నాను, ఇందులో సాధారణ సమస్యలు, ట్రబుల్షుటింగ్ పద్ధతులు , భద్రతా జాగ్రత్తలు మరియు ప్రొఫెషనల్స్ ని ఎపుడు రీచ్ అవ్వాలి అనే దాని గురించి వివరిస్తున్నాము . ఈ ఆర్టికల్ పూర్తయ్యే సరికి మీరు రిఫ్రిజిరేటర్ ని ఇంట్లోనే ఎలా రిపేర్ చేయాలి అనే దాని పై స్పష్టమైన అవగాహన ఉంటుంది.

Refrigerator Problems

రిఫ్రిజిరేటర్లు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటాయి, వాటిలో కొన్ని సులువుగా పరిష్కరించబడతాయి, మరికొన్నింటికి మరింత క్లిష్టమైన మరమ్మతులు అవసరమవుతాయి. రిఫ్రిజిరేటర్ యజమానులు ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలు ఇక్కడ ఉన్నాయి:

How to repair refrigerator at home Telugu

రిఫ్రిజిరేటర్ సరిగ్గా చల్లబడదు

రిఫ్రిజిరేటర్ గురించి తరచుగా వచ్చే ఫిర్యాదుల లో ఒకటి ఏంటంటే అది సరిగా చల్లబడటం లో విఫలం అవుతుంది. దీని వలన ఆహరం చెడి పోవడం మరియు కరెంట్ బిల్లులు ఎక్కువ రావడానికి దారి తీస్తుంది.

క్లినింగ్ కండెన్సర్ కాయిల్స్

సాధారణంగా రిఫ్రిజిరేటర్ కింద లేదా వెనుక ఉన్న డర్టీ కండెన్సర్ కాయిల్స్, కంప్రెసర్ వేడెక్కడం వలన తక్కువ కూలింగ్ కి దారి తీస్తుంది. రిఫ్రిజిరేటర్ ను అన్‌ప్లగ్ చేసి కాయిల్స్ ని పూర్తిగా శుభ్రం చేయడానికి కాయిల్ బ్రష్ లేదా వాక్యూమ్ ఉపయోగించి క్లీన్ చేయండి.

థర్మోస్టాట్‌ను తనిఖీ చేయడం

థర్మోస్టాట్ అనేది రిఫ్రిజిరేటర్ చల్లబరచడం పనితీరుని నియంత్రిస్తుంది. ఇది సరిగ్గా పని చేయకపోతే ఫ్రిడ్జ్ లో కూలింగ్ సరిగా ఉండదు. మీరు మల్టి మీటర్ ఉపయోగించి థర్మోస్టాట్‌ను తనిఖీ చేయవచ్చు.

ఎవాపోరేటర్ ఫ్యాన్‌ని తనిఖీ చేయడం

ఎవాపోరేటర్ ఫ్యాన్ రిఫ్రిజిరేటర్ లో చల్లని గాలిని ప్రసరింపజేయడం లో సహాయ పడుతుంది. ఇది సరిగ్గా పని చేయకపోతే గాలి సరిగ్గా పంపిణీ చేయబడదు , దీని వలన కూలింగ్ తక్కువ వస్తుంది.

ఫ్రీజర్ లో అధిక ఐస్ తయారు అవడం

ఫ్రీజర్ లో వచ్చే సాధారణ సమస్య మంచు ఎక్కువగా గడ్డ కట్టడం , ఫ్రీజర్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. డెఫిక్టివ్ డిఫ్రాస్ట్ టైమర్ లేదా హీటర్ పాడయి పోవడం లేదా ఎయిర్ వెంట్స్ పని చేయక పోవడం వలన ఈ సమస్య వస్తుంది.

పరిష్కారాలు:

  • మల్టిమీటర్ ఉపయోగించి హీటర్‌ను తనిఖీ చేసి అన్ని చెక్ చేయండి, అవసరం అయితే రీప్లేస్ చేయండి.
  • డోర్ గ్యాస్కెట్లు దెబ్బ తిన్నట్లయితే వేడి గాలి లోపలి కి ప్రవేశించి అధిక మంచు ఏర్పడటానికి దారి తీస్తుంది. కనుక ఈ గ్యాస్కెట్లు సరిగా తనిఖీ చేసి అవసరం అయితే రీప్లేస్ చేయండి.
  • ఎయిర్ వెంట్స్ కి మధ్య ఏమైనా అడ్డంకులు వస్తే గాలి ప్రవాహానికి ఆటంకం కలిగి మంచు ఏర్పడే అవకాశం ఉంది, కనుక ఆ అడ్డంకులు తొలగించండి.
అసాధారణ శబ్దాలు
  • డెఫెక్టీవ్ కండెన్సర్ లేదా ఎవాపోరేటర్ ఫ్యాన్ మోటార్లు వదులుగా ఉండే భాగాలు లేదా మౌంటు బ్రాకెట్లు పనిచేయని కంప్రెసర్ వలన శబ్దాలు వచ్చే అవకాశం ఉంది.
  • స్క్రూలు లేదా బోల్ట్ లను ఉపయోగించి వదులుగా ఉన్న భాగాలను బిగించడం వలన ఈ శబ్దాలను పరిష్కరించవచ్చు.
  • ఫ్యాన్ మోటారు సరిగా పని చేయక పోవడం వలన కూడా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే అవకాశం ఉంది, కనుక మల్టీమీటర్ ఉపయోగించి పరీక్షించండి, ఏదయినా తేడా ఉంటె మార్చండి.
రిఫ్రిజిరేటర్ లోపల లేదా కింద నీరు లీక్ అవడం
  • రిఫ్రిజిరేటర్‌లో ఐస్ మేకర్ లేదా వాటర్ డిస్పెన్సర్ సరిగ్గా పని చేయక పోవడం వలన నీరు కారే అవకాశం ఉంది.
  • డీఫ్రాస్ట్ డ్రెయిన్ రిఫ్రిజిరేటర్‌లో నీరు అడ్డుకునేలా చేస్తుంది, కనుక పైప్ క్లీనర్ లేదా గోరు వెచ్చని నీటిని ఉపయోగించడం వలన డ్రెయిన్‌ను అన్‌లాగ్ చేయవచ్చు.
  • వాటర్ ఫిల్టర్ లీక్ లను నివారించడానికి ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఫిల్టర్ లను మార్చండి.
  • ఏవయినా పగుళ్లు లేదా సరిగా లేని కనెక్షన్ ల కోసం వాటర్ లైన్ లను పరిశీలించి లీకులను ఆపడానికి ప్రయత్నించండి.
  • థర్మోస్టాట్ సరైన ఉష్ణోగ్రతకు సెట్ చేసి ఉందో లేదో నిర్ధారించుకోండి, ఇది చాలా తక్కువగా సెట్ చేయబడితే రిఫ్రిజిరేటర్ సరిగా పని చేయదు, సరిగా ఆన్ చేయడం వలన నిరంతరంగా పని చేస్తుంది.

రిఫ్రిజిరేటర్ రిపేర్ కోసం అవసరమైన సాధనాలు

రిఫ్రిజిరేటర్‌ ను రిపేర్ చేసేటప్పుడు సరి అయిన సాధనాలు కలిగి ఉండటం వలన పని ఈజీ అవుతుంది మరియు సమర్థవంతంగా చేయవచ్చు, దానికి అవసరమయిన సాధనాలు.

  • మల్టీమీటర్
  • స్క్రూడ్రైవర్లు
  • నట్ డ్రైవర్ సెట్
  • వాక్యూమ్ క్లీనర్ లేదా కాయిల్ బ్రష్
  • థర్మామీటర్
  • శ్రావణం మరియు వైర్ కట్టర్లు
  • పైప్ క్లీనర్ లేదా టర్కీ బాస్టర్
ప్రొఫెషనల్‌ని ఎప్పుడు పిలవాలి
  • అనేక ఫ్రిడ్జ్ లు రిపేర్స్ ఇంట్లోనే చేయగలిగినప్పటికీ, కొన్నిటికి ప్రొఫెషనల్ టెక్నీషియన్ ను ఉత్తమమైన ఉత్తమమైన పరిస్థితులు ఉన్నాయి.
  • కంప్రెషర్ సంక్లిష్టమైన భాగాలు రిపేర్ చేయడం , పవర్ వచ్చే భాగాలూ లేదా రీప్లేస్ చేసే పరిస్థితి ఉంటె నైపుణ్యుడి అవసరం ఉంది.
  • రెఫ్రిజిరేటర్ షాక్ వస్తున్న లేదా లీక్ లు వస్తున్న, సరిగ్గా చల్లబడక పోయిన, అధికం గా చల్లబడిన ప్రొఫెషనల్ టెక్నీషియన్‌ను పిలవడం ఉత్తమం.
  • మీ రిఫ్రిజిరేటర్ కి వారంటీ ఉంటే, చిన్న చిన్న రిపేర్లు ట్రై చేయడానికి చేయండి లేదా సర్వీసింగ్ చేయించండి.

Geyser Repair

ముగింపు

రిఫ్రిజిరేటర్ రిపేర్ అంత కష్టమైన పని ఏమి కాదు, సాధారణ సమస్య లను అర్ధం చేసుకోవడం, సరైన సామాగ్రి లను కలిగి ఉండటం, సరియైన ట్రబుల్షూటింగ్ పద్దతులను అనుసరించడం వలన స్వంత సమస్యలను పరిష్కరించవచ్చు.

కాయిల్స్ ని శుభ్రపరచడం, డోర్ సీల్ లను పరిశీలించడం వంటి నిర్వహణ లో చురుకు గ ఉండటం వలన ఫ్రిడ్జ్ సమర్థవంతంగా పని చేసేలా చేయడం వలన అనేక సమస్యలను నివారించ వచ్చు.

1 thought on “Best 10+ Tips to repair refrigerator at home Telugu”

Leave a Comment