Best 15+ Watermelon health benefits in telugu

Watermelon అనేది ఉష్ణ మండల పండు దీనిని సైంటిఫిక్ గా సిట్రల్లాస్ లనాటస్ అని పిలుస్తారు, దాని తీపి రుచితో, చల్లగా అనేకమంది హృదయాలను హత్తుకుంది. ఇది ఎక్కువగా వేసవి నెలలో పండుతుంది మరియు ఈ నెలలో పండే కాయలు మాత్రమే రుచిగా, శ్రేష్టంగా ఉంటాయి, కొన్ని చలికాలంలో కూడా పండుతాయి కానీ అవి అంత రుచిని ఇవ్వవు. ఈ పుచ్చకాయలలో అనేక రకాల రంగులు ఉన్నాయి పసుపు రంగు పుచ్చకాయ, ఆకుపచ్చ నలుపు పుచ్చకాయలు ఉన్నాయి.

Nutrients of Watermelon in Telugu

  • ప్రోటీన్
  • ఆరోగ్యకరమైన కొవ్వు
  • ఫైబర్
  • కార్బో హైడ్రేట్లు
  • విటమిన్ సి
  • విటమిన్ ఏ
  • పొటాషియం
  • మెగ్నీషియం

Watermelon Health Benefits in Telugu

  • Watermelon లో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు లైకోపీన్ సెక్యూరిన్ బయో యాక్టీవ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి.
  • వాటర్ మిలన్ కి శరీరాన్ని హైడ్రేట్ చేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండటం వలన శరీరాన్ని హైడ్రేటింగ్ చేస్తుంది.
  • పుచ్చకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది, వేడి వాతావరణం లో లేదా శారీరక శ్రమ చేసినప్పుడు ఈ పుచ్చకాయని తీసుకోవడం వల్ల శరీరంలో కోల్పోయిన ద్రవాలను తిరిగి ఇచ్చి వేడెక్కడాన్ని నిరోధిస్తుంది.
  • పుచ్చకాయలో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది మలాన్ని మృదువుగా చేసి మలబద్దకాన్ని నివారించడమే కాకుండా సాధారణ కదలికలను కూడా సరిచేస్తుంది.
  • ఈ పుచ్చ పండు లో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వలన చర్మ పొడిబార కుండా ఉండటాని,కి చర్మ సమస్యలు రాకుండా ఉండటానికి స్కిన్ గ్లో అవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది.
  • ఈ పుచ్చకాయలు లో మెగ్నీషియం పొటాషియం ఇంకా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు ఉండటం వలన శరీరంలోని ద్రవ సమతుల్యతను కాపాడటానికి కీలక పాత్ర వహిస్తుంది
  • పుచ్చకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తటస్థం చేసి, ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించి, సెల్లులార్ దెబ్బతినకుండా ఉండటానికి బాగా పనిచేస్తుంది.
  • పుచ్చకాయ ఎర్రగా ఉండటానికి కారణం అందులో ఉండే లైకోపీన్, ఇది సమృద్ధిగా ఉండటం వలన ఎరుపు రంగులో పండుతుంది, ఈ లైకోపిన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
  • జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం లైకోపీన్ ఎక్కువగా తీసుకోవడం వలన ప్రోస్ట్రేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అని నిరూపించబడింది.
  • అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం లైకోపీని తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు తగ్గుతాయాని నిర్ధారించారు.
  • జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఈ లైకోపీన్ అనేది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుందని ఇంకా అతనిలోహిత కిరణాలు చర్మంపై పడకుండా ఉండటానికి చర్మం దెబ్బ తినకుండా ఉండటానికి చర్మాన్ని కాపాడుతుంది అని కనుగొంది.
  • పుచ్చకాయలు లో ఎక్కువగా ఉండే విటమిన్ విటమిన్ సి ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడమే కాకుండా కొల్లాజం ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.
  • ఈ పుచ్చకాయలలో ఉండే పోషకాలు, విటమిన్లు, బయో యాక్టింగ్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా హృదయ ఆరోగ్యానికి చాలా మంచిది అని పరిశోధనలు తెలుపుతున్నాయి.
  • పుచ్చకాయలు సిట్రులిన్ అనే అమినోయాసిడ్ అనేది అధికంగా ఉంటుంది ఇది రక్తప్రాసనను మెరుగుపరచడమే కాకుండా రక్తపోటును తగ్గించడానికి ఇంకా నైట్రిక్ ఆక్సిడెంట్ ఉత్పత్తి చేయడానికి రక్తనాళాలను సదలించటం రక్త ప్రసరణ మెరుగుపరచడం వంటివి చేస్తుంది.
watermelon
  • పుచ్చకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా లైకోపీన్ అనేది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • పుచ్చకాయల్లో ఉండే ఫైబర్ కంటెంట్ మరియు వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వలన జీర్ణ క్రియ కు మద్దతు ఇస్తుంది.
  • పుచ్చకాయని ఆల్కలీన్ ఆహారం అంటారు ఎందుకంటే ఇది పొట్టలోని ఆమ్లాన్ని తటస్థం చేయడానికి ఇంకా యాసిడ్ రిఫ్లెక్స్ లేదా గుండెల్లో మంటతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపశమనం చేయడం ద్వారా తగ్గిస్తుందని చెప్తున్నారు.
  • పుచ్చకాయలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇంకా కంటి శుక్లాల రాకుండా ఉండటానికి రెటీనా లోని వర్ణ ద్రవ్యరాశి ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది.
  • పుచ్చకాయలో ఉండే మెగ్నీషియం విటమిన్ బి 6, విటమిన్లు, ఖనిజాలు, మెదడు ఆరోగ్యానికి తోడ్పడటానికి కీలక పాత్ర వహిస్తాయి, ఇంకా స్ట్రెస్ ని తగ్గించడానికి, న్యూరో ట్రాన్స్మిటర్ పని తీరుకు ఇది సహాయం చేస్తుంది.
  • పుచ్చకాయలో ఉండే అధిక వాటర్ వలన కళ్ళను తేమ గా ఉంచడానికి పొడి మరియు చికాకు నివారిస్తుంది.
  • పుచ్చకాయలు లో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాలరీలు తక్కువ ఉంటాయి దాని వలన ఎంత తిన్నా కూడా బరువు పెరగకుండా బరువు తగ్గుతారు.
  • పుచ్చకాయలో నాచురల్ షుగర్స్ ఉండటం వలన షుగర్ స్థాయి లను పెంచకుండా ఉంచి, డయాబెటిస్ వాళ్ళకి ఇది చాలా మంచిది.
  • పుచ్చకాయలు సిట్రోలిన్ ఉండటం వలన కండరాల నొప్పులను తగ్గిస్తుందని జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో చెప్పబడింది.

ముగింపు

పుచ్చకాయను పిల్లలనుండి పెద్ద వారి వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు మరియు ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, ఇందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్, విటమిన్లు, మినరల్స్, హైడ్రేటింగ్ లక్షణాలు అదికంగా ఉన్నాయి

Read More:-

Brazil Nuts Health Benefits

Lakshman Phal Juice Health Benefits in Telugu

Leave a Comment