Ragulu ప్రధానంగా భారతీ ఉపఖండంలో మరియు ఆఫ్రికాలో 5000 సంవత్సరాల పైనుండి సాగు చేయబడుతుంది, దీనిని ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. దీనిని పండించడానికి అనేక వాతావరణాలు అనుకూలంగా ఉంటాయి మరియు ఇందులో పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.
మొట్టమొదటిగా రాగులు ఆఫ్రికాలో సాగు చేయడం మొదలైంది ఆ తరువాత భారత ఉపఖండంలో కూడా సాగు చేయడం మొదలుపెట్టారు. ఈ రాగులు మొట్టమొదటిగా ఆఫ్రికాలో సాగు చేయబడింది అని పురావస్తు ఆధారాలలో కూడా దొరికింది. దీనిని పేదవారిపంట అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది వృద్ధి చెందడానికి కష్టపడే సుష్క మరియు ఉపాంత భూముల్లో పెరిగే సామర్థ్యం ఉంది కాబట్టి. ఇది భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక లో ఎక్కువగా సాగు చేయబడుతుంది ఎందుకంటే ఇక్కడ పొడి వాతావరణం ఉంటుంది కనుక. ఆఫ్రికాలో ఇథియోపియా ఉగాండాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది.
ఈ Finger Millet చిన్నవిగా గుండ్రంగా లైట్ ఎరుపు రంగులో ఉంటాయి, ఇవి నాలుగు ఐదు నెలలకి పండుతుంది. ఈ రాగులను గట్టిపంట అంటారు ఎందుకంటే ఇది పండించడానికి తక్కువ నీరు అవసరం అవుతుంది.
Table of Contents
Ragulu Nutrients
- కార్బో హైడ్రేట్లు
- డైటరీ ఫైబర్
- ప్రోటీన్
- కొవ్వులు
- విటమిన్ బి 3
- విటమిన్ బి 6
- ఫోలేట్
- క్యాల్షియం
- ఐరన్
- పొటాషియం
- మెగ్నీషియం
- జింక్
- భాస్వరం
Ragulu Health Benefits
- రాగుల లో అధికంగా ఉండేది ఏమిటంటే కాల్షియం ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, దంతాల అభివృద్ధికి, ఎముకలు స్ట్రాంగ్ గా అవ్వడానికి, బోలు ఎముకల వ్యాధి నుండి నయం చేయడానికి ఇది సహాయం చేస్తుంది.
- జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రనాలజీ లో చేసిన రీఛార్జ్ ప్రకారం క్యాల్షియం తీసుకోవడం వల్ల రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఎముకలు స్ట్రాంగ్ గా ఉండడాన్ని ప్రభావితం చేస్తుంది అని నిరూపించారు.
- రాగులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముక ఖనిజ సాంద్రత పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది.
- రాగుల్లో ముఖ్య మూలం ఫైబర్ ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, పేగు కదలికలను నియంత్రించడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి, గట్ ఆరోగ్యానికి దోహదం చేయడానికి సహాయపడుతుంది.
- ఈ ఫింగర్ మిల్లెట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంది, ఇది గ్లూకోస్ ని నెమ్మదిగా రక్త ప్రవాహంలోకి విడుదల చేసి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
- ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్ లో ఒక అధ్యయనం ప్రకారం టైప్ టు డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఫింగర్ మిల్లెట్లో గ్లైసిమిక్ నియంత్రణను గణనీయంగా మెరుగుపరుస్తుంది అని ఇంకా రక్తంలో చక్కర నిర్వహణను తగ్గిస్తుంది అని నిరూపించారు.
- రాగులలో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి దోహదం చేస్తుంది.
- రాగులు లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మంటను తగ్గించడం, కణాలను దెబ్బ తినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో జరిగిన ఒక పరిశోధనలో రాగులు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ చర్యను ప్రదర్శిస్తుందని ఇంకా ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అని సూచిస్తుంది.
- ఈ రాగులకి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి ఉండటం వలన గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ ఒక రీసెర్చ్ ప్రకారం రాగులలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ ఉందని గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ప్రచురించారు.
- రాగులలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలి అనుకునేవారు ఇవి నిత్యం వాడడం వలన మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
- రాగులను ఐరన్ అనేది కూడా అధికంగా ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడటమే కాకుండా శరీరం అంతటా ఆక్సిజన్ ని రవాణా చేసి హిమోగ్లోబిన్ బాధ్యత వహిస్తుంది.
- జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో రాగులలో అధిక ఫైబర్ ఆహారాలు ఉన్నాయి అని ఇది బరువు నిర్వహణలో మంచి రిజల్ట్ కనిపించాయని ప్రచురించారు.
- రాగులు ఐరన్ రిచ్ ఫుడ్స్ అని అంటారు ఎందుకంటే ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది మరియు ఐరన్ డెఫిషియన్సీ కామా ఎనీమియా ఉన్న వ్యక్తులకు ఇవి నిత్యం తీసుకోవడం వలన ఐరన్ లెవెల్స్ ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది.
- పాలు ఇచ్చే తల్లులకు ఒకవేళ పాలు సరిగా పడకపోతే నిత్యం రాగులు వాడటం వలన రాగులలో ఉండే కాల్షియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు మూలంగా పాలు పడే అవకాశం ఉంటుంది.
- రాగులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయడానికి చర్మం దెబ్బ తినకుండా కాపాడటానికి సహాయపడుతుంది.
- రాగులు పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి కనుక ఈ రాగులను పిల్లలకు స్నాక్స్ రూపంలో కానీ లేదా జామ రూపంలో కానీ లేదా రాగి సంకటిగా లేదా రాగి ముద్ద చేసి నిత్యం ఇవ్వండి.
ముగింపు
రాగులు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ఉన్న పురాతన ధాన్యం, ఇందులో కాల్షియం అధికంగా ఉండటం వలన ఎముకలకు, ఇంకా ఐరన్ అధికంగా ఉండటం వలన హిమోగ్లోబిన్ కి సహాయ పడటానికి, ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.
Read More:-