ఈరోజు ఈ బ్లాగ్ లో Dragon fruit ఆరోగ్య ప్రయోజానాలు, పోషకాల గురుంచి తెలుసుకుందాం. డ్రాగన్ పండు ని పిటాయా అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువ గా ఉష్ణ మండలం లో సాగు చేయబడుతుంది మరియు చూడటానికి ఎర్రటి లేదా పసుపు రంగు స్కిన్ కలిగి ఉంటుంది. ఈ డ్రాగన్ పండు తినడానికి తియ్యగా కొంచెం చప్ప గా ఉంటుంది మరియు గుజ్జు లో సన్నని విత్తనాల ను కలిగి ఉంటుంది.
Pitaya ని అందరూ ఎక్కువగా ఇష్ట పడటానికి కారణం దాని లోని DNA ప్రత్యేక రూపం మరియు ఎన్నో ప్రయోజనాలు ఉన్న సూపర్‌ఫుడ్. ఈ డ్రాగన్ పండు ని ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మరియు ఆహార ప్రియులు ఎక్కువగా తింటారు.
డ్రాగన్ పండు ని సింటిఫిక్ గా హైలోసెరియస్ కాక్టస్ అని అంటారు. దీని పువ్వులు కేవలం రాత్రి పూటనే పూస్తాయి మరియు ఈ ఫ్రూట్ ఆకారం డ్రాగన్ మాదిరిగా ఉంది అని డ్రాగన్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఈ రోజుల్లో డ్రాగన్ ఫ్రూట్ అత్యంత ప్రజాదరణ పొందటం వలన ప్రపంచం మొత్తమ్ లో అన్ని దేశాల లో ఎక్కువ గా దొరుకుతుంది.
Table of Contents
What is Dragon fruit?
ప్రస్తుత రోజుల్లో డ్రాగన్ పండు అనేది అత్యంత ముఖ్య పాత్ర వహిస్తుంది, ఇది హైలోసెరియస్ అని పిలువబడే క్లైంబింగ్ కాక్టస్‌పై పెరిగే మొక్క. దీని పేరు గ్రీకు పదం నుండి హైల్ నుండి వచ్చింది దీని అర్ధం వుడీ మరియు సెరియస్ అనేది లాటిన్ పదం దీని అర్ధం మైనం.
ఈ డ్రాగన్ ఫ్రూట్ లోపలి భాగం తెల్లటి లేదా ఎరుపు రంగు గుజ్జుతో నల్లటి విత్తనాలు కలిగి ఉంటుంది, బయటి భాగం పసుపు రంగు లేదా గులాబీ రంగు ని కలిగి ఆకుపచ్చ ఆకులు కలిగి ఉంటుంది. డ్రాగన్ పండు అనేది మొదట మధ్య అమెరికా మరియు దక్షిణ మెక్సికో పెరిగింది, ఫ్రెంచ్ వారు దీనిని 19వ శతాబ్దం ప్రారంభంలో ఆగ్నేయాసియా కు తీసుకువచ్చారు.
Dragon Fruit Nutrients
- ప్రోటీన్
- కార్బో హైడ్రేట్
- ఫైబర్
- కాల్షియం
- సోడియం
- విటమిన్ సి
Dragon Fruit Types
పసుపు డ్రాగన్ ఫ్రూట్: ఇది తినడానికి తియ్య గా ఉంటుంది, చర్మానికి మరియు రోగనిరోధక వ్యవస్థ కు సహాయపడే విటమిన్ సి తో మెండు గా ఉంటుంది. అదనంగా, బరువు తగ్గడానికి బాగా పని చేయడంలో మరియు మీ పొట్ట నిండుగా అనిపించేలా సహాయపడే ఫైబర్ ఇందులో ఉంటుంది.
పర్పుల్ డ్రాగన్ ఫ్రూట్: ఇది చాలా రుచిగా శ్రేష్టం గా ఉంటుంది ఇందులో ఫైబర్ మరియు విటమిన్లు నిండు గా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన శరీరంలోని చెడు పదార్థాలతో పోరాడి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది.
పింక్ డ్రాగన్ ఫ్రూట్: ఇది తియ్యగా మరియు కొంచెం జిడ్డుగా ఉంటుంది, ఇది విటమిన్ సి మరియు ఫైబర్‌తో ఉండటం వలన జీర్ణక్రియకు మరియు చర్మానికి చాలా దోహదం చేస్తుంది.
రెడ్ డ్రాగన్ ఫ్రూట్: ఇది ఎరుపు గుజ్జు ని కలిగి లైకోపీన్ అని పిలువబడే దానితో నిండు గా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ను నివారించడంలో మరియు గుండెకు చాలా మంచిది మరియు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి రెడ్ డ్రాగన్ లో ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.
Dragon fruit Health Benefits in Telugu
- డ్రాగన్ ఫ్రూట్ లో బీటాసైనిన్, ఫినోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికం గా ఉన్నాయి. ఈ డ్రాగన్ పండు లో క్యాన్సర్ మరియు అకాల వృద్ధాప్యం వంటి వ్యాధులకు కూడా దారితీసే అణువులు, కణాలను ఫ్రీ రాడికల్స్ ద్వారా దెబ్బతినకుండా కాపాడటానికి దోహదం చేస్తుంది.
- ఈ డ్రాగన్ పండు తీసుకోవడం వలన ఫైబర్ మరియు సహజంగా తక్కువ కొవ్వు కలిగి ఉండటం వలన సులభం గా బరువు తగ్గుతారు.
- ఎలుకల పై జరిగిన ఒక పరిశోధన లో డ్రాగన్ పండు బ్లడ్ షుగర్ లెవెల్స్ లను తగ్గించటంలో బాగా సహాయ పడుతుంది, దీనిని మన శరీరానికి 250 మరియు 500 mg/kg తీసుకోవడం వలన బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ఘననీయంగా తగ్గాయి.
- ఈ డ్రాగన్ పండు లో బయో యాక్టీవ్ సమ్మేళనాలు వలన ఆహారాన్ని జీర్ణం చేయడానికి, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పోషించడానికి, ప్రేగులలో మంచి నుండి చెడు బ్యాక్టీరియా వరకు సమతుల్యతను అభివృద్ధి చేస్తుంది.
- డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు లో బెటాలిన్ ఉండటం వలన ఆక్సీకరణ నష్టాన్ని నివారించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ నుండి రక్షించడంలో సహాయ పడుతుంది.
- డ్రాగన్ ఫ్రూట్‌లోని హైడ్రాక్సీసిన్నమేట్స్ క్యాన్సర్ నిరోధక ప్రయోజనాల ను కలిగి ఉంది.
- డ్రాగన్ ఫ్రూట్లో ఫ్లేవనాయిడ్లు మెండు గా ఉండటం వలన మెదడు ఆరోగ్యం మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- ఇందులో ఫైబర్ కారణంగా షుగర్ వచ్చే సూచనలను నివారించడమే కాకుండా ప్యాంక్రియాస్ చక్కెరను విచ్ఛిన్నం చేసే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి చక్కెరను నియంత్రించడంలో సహాయ పడుతుంది.
- డ్రాగన్ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ద్వారా జరిగే నష్టాన్ని, మధుమేహం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.
- డ్రాగన్ పండులో ఒలిగోశాకరైడ్స్ లాంటి ప్రీబయోటిక్స్ ఉండటం వలన గట్ బ్యాక్టీరియా ఆహారాన్ని ఈజీ గా జీర్ణం అయ్యేలా చేయడం వలన వాటిని విచ్ఛిన్నం చేస్తుంది.
- ఇది ఐరన్ రిచ్ ఫుడ్ కావడం వలన శరీర భాగాలకు ఆక్సిజన్‌ను రవాణా చేయడంలో సహాయపడతాయి.
ముగింపు
డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల చర్మానికి, జుట్టు కి , రోగ నిరోధక వ్యవస్థ ని మెరుగు పరచడానికి, ఎముకలను బలం గా, కంటి వ్యాధులను నివారించడంలో, హిమోగ్లోబిన్ తయారీలో సహాయపడుతుంది.
Read More:-