Best 10+ Sunflower seeds health benefits in telugu

Sunflower seeds అనేవి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సన్‌ఫ్లవర్ విత్తనాలు మనకు ట్రైల్ మిక్స్ గింజలు గా న్యూట్రిషన్ బార్‌ మరియు మల్టీ గ్రెయిన్ బ్రెడ్ లా కూడా దొరుకుతాయి. ఈ ప్రొద్దు తిరుగుడు విత్తనాలు లో ఆరోగ్యకరమైన అనేక విటమిన్లు, ఫ్యాట్స్ మరియు ఖనిజాలతో అధికం గా ఉన్నాయి. మీ టైప్ 2 డయాబెటిస్‌ మరియు గుండె జబ్బులు తో సహా అన్ని ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ సన్‌ఫ్లవర్ విత్తనాలు ప్రత్యేక పోషక పాత్ర వహిస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాల గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయం ఈ ఆర్టీకల్ లో పూర్తి గా ఉంది, వాటి ప్రయోజనాలు, పోషకాహారం మరియు వాటిని ఎలా తినాలి అని ఇక్కడ చదవండి.

What are Sunflower seeds?

Sunflower seeds పొద్దుతిరుగుడు మొక్క పువ్వు లో ఉండే గింజలు. 12 అంగుళాలు ఉన్న ఈ సన్‌ఫ్లవర్ విత్తనాల మొక్క అనేది చాలా విశాలమైనది. ఈ మొక్క యొక్క విశాలమైన పుష్పాలు నుండి సన్‌ఫ్లవర్ గింజల ను తీయడం జరుగుతుంది. ఒక పొద్దుతిరుగుడు పుష్పం లో 2,000 విత్తనాలు పై వరకు ఉండే అవకాశం ఉందని అని ఒక అంచనా.

సాధారణంగా సన్‌ఫ్లవర్ పంటలలో రెండు ముఖ్య రకాల పంటలు ఉన్నాయి, ఒక రకం పంట వచ్చేసి ఎక్కువ మంది వ్యవసాయం చేసేది, ఇంకో రకం పంట వచ్చేసి తినే విత్తనాల కోసం, నూనెల కోసం పండిస్తారు.

మనం తినే సన్‌ఫ్లవర్ విత్తనాలు అనేవి నలుపు, తెలుపు రంగుల తో ఉంటాయి. ఇంకో పొద్దుతిరుగుడు నూనెను తీయడానికి ఉపయోగించే రకం పంట లో దృఢమైన నల్లటి గింజలు అనేవి ఉంటాయి.

sunflower seeds

Sunflower seeds Nutrients

  • ఇనుము
  • మెగ్నీషియం
  • జింక్
  • రాగి
  • మాంగనీస్
  • సెలీనియం
  • కేలరీలు – 163
  • మొత్తం కొవ్వు – 14 గ్రాములు
  • సంతృప్త కొవ్వు – 1.5 గ్రాములు
  • బహుళఅసంతృప్త కొవ్వు – 9.2 గ్రాములు
  • మోనోశాచురేటెడ్ కొవ్వు – 2.7 గ్రాములు
  • ప్రొటీన్ – 5.5 గ్రాములు
  • పిండి పదార్థాలు – 6.5 గ్రాములు
  • ఫైబర్ – 3 గ్రాములు

పొద్దుతిరుగుడు గింజల లో ముఖ్యంగా సెలీనియం మరియు విటమిన్ ఇ అనేవి అధికంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, మన శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ ను డ్యామేజ్ నుండి రక్షించడానికి, అనేక దీర్ఘకాలిక వ్యాధులలో నుండి రక్షించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా, పొద్దుతిరుగుడు గింజల లో ఫినోలిక్ ఆమ్లాలు మరియు ఫ్లేవనాయిడ్‌లతో సహా అనేక ప్రయోజనకరమైన మంచి పోషక వనరు అని చెప్పవచ్చు.

Sunflower seeds Health Benefits:-

  • సన్‌ఫ్లవర్ గింజల లో మెగ్నీషియం, ప్రోటీన్, విటమిన్ ఇ , లినోలెయిక్ కొవ్వు ఆమ్లాలు మరియు అనేక రకాల సమ్మేళనాలను కలిగి ఉన్నందున కొలెస్ట్రాల్, రక్తపోటు మరియు రక్తంలో చక్కెరను తగ్గించడంలో మనకు బాగా ఉపయోగ పడతాయి.
  • ప్రొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవడం వలన దీర్ఘకాలిక వాపు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని టైప్ టు డయాబెటిస్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • 6000 కంటే ఎక్కువ మంది పెద్దలలో జరిపిన ఒక అధ్యయనంలో ఈ ప్రొద్దుటూరు గింజలను వారానికి కనీసం ఐదు సార్లు తిన్న వ్యక్తులు, తినని వ్యక్తులతో పోలిస్తే 32% తక్కువ స్థాయిలో సి రియాక్టివ్ ప్రోటీన్ కలిగి ఉన్నారని కనుగొన్నారు.
  • పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన సి రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని, ఇందులోని ఫ్లేవర్ ఆయిల్ మంటను కూడా తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
  • హై బీపీ అనేది గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం, ఇది గుండెపోటు లేదా స్ట్రోక్‌కు కూడా దారితీస్తుంది. సన్‌ఫ్లవర్ గింజలలోని పోషకాలు రక్తనాళాలును కుంచించుకుపోయేలా చేసే ఎంజైమ్‌ను అడ్డుకుంటాయి, దాని వలన రక్తపోటును కూడా తగ్గిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు లో ఉన్నమెగ్నీషియం కూడా రక్తపోటు స్థాయిల ని తగ్గిస్తుంది.
  • అంతే కాకుండా పొద్దుతిరుగుడు విత్తనాల లో లినోలెయిక్ ఆమ్లం మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలం గా ఉన్నాయి. ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు మీ శరీరం లో లినోలెయిక్ యాసిడ్‌ని ఉపయోగించి రక్తనాళాలను సడలించి, తక్కువ రక్తపోటును ప్రోత్సహించే హార్మోన్ లాంటి సమ్మేళనాన్ని శరీరం లో తయారు చేస్తుంది. అంతే కాకుండా లినోలెయిక్ కొవ్వు ఆమ్లం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా ఉపయోగ పడుతుంది.
  • కొన్ని అధ్యయనాల సమీక్షలో అత్యధిక లినోలెయిక్ యాసిడ్ అనేది తీసుకున్నవ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అనేది 15% తక్కువగా ఉంటుంది అని, గుండె జబ్బులతో స్ట్రోక్ ప్రమాదం అనేది కూడా 21% తక్కువగా ఉంటుంది అని పరిశోధనలో కనుగొన్నారు.
  • పొద్దుతిరుగుడు విత్తనాల లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉండటం వలన రక్తంలో చక్కెరను తగ్గించే ప్రభావం ఉంది అని చెబుతున్నారు. ఒక పరోశోధన లో భాగంగా నిత్యం ముప్పై గ్రాములు పొద్దుతిరుగుడు గింజల ను తినే వ్యక్తుల ఆహారంతో పోలిస్తే, ఆరు నెలల్లో రక్తంలో చక్కెరను 10% తగ్గించవచ్చని పరిశోధన లో తేలింది.
  • చపాతీ కానీ, సలాడ్స్ లేదా స్నాక్స్ రూపం లో పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోవడం వలన రక్తంలో ఉన్న చక్కెరపై కార్బోహైడ్రేట్ల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
  • పొట్టు తీయని పొద్దుతిరుగుడు విత్తనాలు డైరెక్ట్ గా నెయ్యి లో వేయించి తినవచ్చు లేదా ట్రైల్ మిక్స్, సలాడ్‌లు వంటి ఏవైనా ఆహారాలకు కలిపి కూడా తీసుకోవచ్చు.

పొద్దుతిరుగుడు విత్తనాల దుష్ప్రభావాలు

  • సన్‌ఫ్లవర్ గింజలు అనేవి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, వాటికి అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
  • పొద్దుతిరుగుడు విత్తనాల లో పోషకాలు అనేవి పుష్కలంగా ఉన్నప్పటికీ, కేలరీలు అనేవి చాలా అధికం గానే ఉంటాయి.
  • సన్‌ఫ్లవర్ గింజలు లో కాడ్మియం కంటెంట్ అధికం గా ఉండుట వలన ఎక్కువ రోజల పాటు అధిక మోతాదుకు తీసుకుంటే ఈ హెవీ మెటల్ అనేది మీ కిడ్నీలకు హాని చేస్తుంది.
  • ఈ సన్‌ఫ్లవర్ గింజలు అనేవి భూమి నుండి కాడ్మియంను తీసుకుంటాయి, తీసుకున్న తరువాత దానిని వాటి విత్తనాలలో స్టోర్ చేస్తుంది, కావున ఇవి ఇతర ఆహారాల కంటే కొంత అధిక మొత్తంలో ఉంటాయి.
  • ఒకేసారి ఎక్కువ మోతాదు లో సన్‌ఫ్లవర్ గింజలను తీసుకోవడం వల్ల పిల్లలు మరియు పెద్దలలో అప్పుడప్పుడు మలం అడ్డంకులు లేదా మల బద్ధకం అనే సమస్యలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ముగింపు:-

సన్‌ఫ్లవర్ గింజలు కొంచెం వగరుగా,కొంచెం క్రంచీగా అనేక వంటకాలకు కూడా రుచికరం గా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మంట మరియు టైప్ 2 డయాబెటిస్‌తో పోరాడటానికి సహాయపడే వివిధ పోషకాల తో నిండి ఉన్నాయి. అయినప్పటికీ ఇందులో క్యాలరీలు ఎక్కువ గా గా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా తింటే దుష్ప్రభావాలకు కూడా దారితీయవచ్చు.

Read More:-

Brazil Nuts Health Benefits

Lakshman Phal Juice Health Benefits in Telugu

Leave a Comment