అరటిపండ్లు చాలా రుచి గా, ఆరోగ్యకరం గా ఉంటాయి, అంతే కాకుండా ఎవరైనా కొనుగోలు చేయగల చవకైన తాజా పండ్లలో Banana ఒకటి.
ఈ అరటి పండ్లు అనేవి వేడి వాతావరణం లో పెరుగుతాయి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటే అరటిపండు అనేది ఒక గొప్ప వనరు, ఇది ఆసియా ఖండానికి చెందినప్పటికీ చాలా ప్రాంతాలలో పెరుగుతుంది. ఈ అరటి పండ్లు అన్ని కిరాణా షాపుల్లో బయట బండ్ల మీద చాలా ప్రాంతాలలో దొరుకుతుంది.
ఇది ముందుగా దృఢంగా ఆకుపచ్చగా ప్రారంభమై పండినప్పుడు పసుపు రంగు మరియు తీయగా మారుతుంది. అరటిపండు లో అనేక ముఖ్యమైన పోషకాలు కలిగి ఉండటం వలన బరువు తగ్గడంలో జిన్నక్రియను మెరుగుపరచడంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.
Table of Contents
Banana Nutrients
- విటమిన్ సి
- రిబోఫ్లావిన్
- ఫోలేట్
- నియాసిన్
- కాపర్
- కేలరీలు – 112
- కొవ్వు – 0 గ్రాములు
- ప్రోటీన్ – 1 గ్రాము
- పిండి పదార్థాలు – 29 గ్రాములు
- ఫైబర్ – 3 గ్రాములు
Banana Health Benefits in Telugu
- ఒక Banana లో ఎక్కువగా వాటర్ కంటెంట్ మరియు పిండి పదార్థాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఇందులో దాదాపుగా 112 క్యాలరీలను అందిస్తుంది.
- ఈ అరటి పండులో ప్రోటీన్ తక్కువగా మరియు కొవ్వు కలిగి ఉంటుంది,
- అరటి పండులో కరిగే ఫైబర్ అనేది నిండుగా ఉండటం వలన జీర్ణక్రియ సమయంలో ద్రవంలో కరిగి ఒక జెల్ లాగా తయారవుతుంది మరియు రక్తంలోనే చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది.
- పండని అరటి పండ్లలో పిండి పదార్థాల్లో ఎక్కువగా రెసిస్టెంట్ స్టార్చ్ మరియు స్టార్చ్ రూపంలో ఉంటుంది అది పండగానే తీయగా అవుతుంది కానీ అప్పుడు ఫైబర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది.
- పచ్చి అరటి పండ్లలో కూడా నిరోధక పిండిని కలిగి ఉంటుంది కాబట్టి ఇది మీ శరీరం ద్వారా త్వరగా జీర్ణం కాదు కానీ ఈ రెండు రకాల ఫైబర్ అనేది భోజనం తర్వాత మీ రక్తంలో ఉండే షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది అంతేకాకుండా ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
- డయాబెటిస్ ఉన్నవారు అరటి పండ్లను తీసుకోవచ్చు కానీ ఎక్కువ భాగాన్ని ఒకేసారి తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఇందులో కార్ కంటెంట్ అనేది ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వ్యక్తులలో రక్తం ఉన్న చక్కెర స్థాయిలను పెద్ద పెరుగుదలను కలిగించవు కానీ షుగర్ ఉన్న వారు తక్కువ తీసుకుంటే మంచిది.
- అరటిపండులో సుమారు మూడు గ్రాముల ఫైబర్ ను కలిగి ఉంటుంది కాబట్టి మెరుగైన జీర్ణ క్రియతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఒక మధ్యతర అరటిపండు కలిగి ఉంది.
- పచ్చి అరటి పండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉండటం వలన ప్రీబయోటిక్ తయారు అయ్యి జీర్ణ క్రియ నుండి తప్పించుకొని ఆ తర్వాత పెద్ద ప్రేగు ముగిసి గట్టులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా తయారవుతుంది.
- ఇంకా పచ్చి అరటిపండు మరియు పండిన అరటి పండ్లలో పెక్టిన్ అనే ఫైబర్ ఉండటం వలన ఇది మలబద్ధకాన్ని నివారించడంలో, మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.
- కొన్ని పరిశోధనల్లో అరటి పండులో ఉండే పెక్టిన్ అనేది పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడుతుందని తేలింది.
- ఇంకా పచ్చి అరటి పండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది కాబట్టి ఇది ఆకలిని నింపి, బరువు తగ్గటానికి సహాయపడుతుంది కాబట్టి దీన్ని మీరు కూరగా తయారు చేసుకుంటే బాగుంటుంది.
- అరటి పండులో అధికంగా ఉండే గొప్ప పోషక వనరు పొటాషియం, ఇది మన శరీరానికి కావలసిన ముఖ్య ఖనిజం రక్తపోటు నివారణకు, గుండె ఆరోగ్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
- అరటి పండులో పొటాషియం అధికంగా ఉండటం వలన రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బులు, అధిక స్థాయి కొవ్వుల ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది.
- ఇంకా ఈ అరటి పండ్లలో ఫ్లేవనాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన ఇవి శరీరం కణాలకి ఆక్సీకరణ నష్టం జరగకుండా కాపాడుతుంది.
- అరటి పండులో మెగ్నీషియం అనేది అధికంగా ఉండటం వలన మెగ్నీషియం లోపం వలన వచ్చే వ్యాధులు అంటే గుండె జబ్బులు రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.
ముగింపు
అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ఉన్న అరటి పండ్లు ఒక ప్రసిద్ధ పండు ఇందులో ఫైబర్ ఆంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన జీర్ణశక్తి నీ గుండె ఆరోగ్యాన్ని బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఇందులో తక్కువ క్యాలరీలు మరి పోషక సాంద్రత కలిగి ఉండటం వలన మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది.
Read More:-