Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ క్రేజీ అప్‌డేట్: 70 శాతం షూటింగ్ పూర్తి.. సెట్స్‌లోకి తారక్ ఎప్పుడంటే?

Dragon Movie

సినిమా, సెప్టెంబర్ 21, 2026 : గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ (Dragon) మూవీపై ఒక కీలక అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

జిమ్ చేస్తుండగా భుజానికి గాయం కావడంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న తారక్.. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా, ఎన్టీఆర్ లేని ఇతర కీలక సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ వేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ వ్యూహంతో ఇప్పటివరకు దాదాపు 70 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు చిత్ర వర్గాల సమాచారం.

గాయం నుంచి కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్.. అక్టోబర్‌ మొదటి వారం నుంచి తిరిగి మళ్లీ ‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఒక సుదీర్ఘ షెడ్యూల్‌ను చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్‌లో సినిమాకు అత్యంత కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.